పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ హిట్ తర్వాత రష్మిక మందన్నా నేషనల్ క్రష్ మారింది. ఆమె పాపులరాటీ నేషనల్ స్థాయికి వెళ్లింది. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు రష్మిక. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న రష్మిక తాజాగా.. తన వర్కవుట్లకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన వర్కవుట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మెరుపు వేగంగా వ్యాయమం చేస్తోంది. ఆమె చేసే వర్కవుట్ల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ భామ ఫుల్ ఫిట్ గా కనిపిస్తోంది. ఇటీవల కాలం నుంచి వరుస ప్రాజెక్ట్ లతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో అయితే ఎక్కువగా ప్రాజెక్ట్ లకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. చివరగా ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాల్లో యంగ్ హీరో శర్వానందతో నటించింది. ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రష్మికకు తెలుగులో ఉన్న ఏకైక చిత్రం పుష్ప పార్ట్ -2. ఈ మూవీ షూటింగ్ వేసవిలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.తమిళంలో అయితే కార్తీ సుల్తాన్ తరువాత మరో ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో పడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రష్మికకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. తాజాగా ఈ భామ వర్కవుట్ల వీడియో కుర్రకారు కి మతిపోగోట్టేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.