సినీ సెలబ్రిటీలు మామూలుగా సినిమాలలో చెప్పే డైలాగ్స్ ని అభిమానులు థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారేమో గానీ.. బయట మాట్లాడే మాటలు మాత్రం వివాదాలకు దారి తీస్తుంటాయి. అయితే.. ఏదైనా విషయంపై పాజిటివ్ గా మాట్లాడితే ప్రేక్షకుల రియాక్షన్ వేరేలా ఉంటుందేమో.. కానీ, సెలబ్రిటీల నోటి నుండి పెళ్లి కాకుండా పిల్లల్ని కనొచ్చు అనే మాట వస్తే మాత్రం ఖచ్చితంగా కాంట్రావర్సీ జరుగుతుంది. తాజాగా పెళ్లి కాకుండా పిల్లల్ని కనడంలో తప్పు లేదనే షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్.
జయ బచ్చన్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న జయ.. రాజకీయాలలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఇటీవల దీపావళి వేడుకలలో అనుమతి లేకుండా ఫోటోలు తీస్తున్నారని కెమెరామెన్స్ పై కోప్పడిన జయ.. తాజాగా తన మనవరాలు నవ్య నవేలి గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. తన కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి పెళ్లి కాకుండా పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అంతేగాక ఎలాంటి రిలేషన్ షిప్ లో అయినా శారీరకంగా ఆకర్షణ తప్పనిసరి అని మనవరాలు నవ్యతో కలిసి పోడ్ కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది జయ.
ఆమె మాట్లాడుతూ.. మనవరాలు నవ్య పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మాట్లాడితే జనాలు నన్ను వ్యతిరేకిస్తారు. కానీ, శారీరక ఆకర్షణ చాలా ముఖ్యం. మా కాలంలో మేము ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. నేటితరం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? లాంగ్ రిలేషన్ లో ఉండేవారు శారీరక సంబంధంలో లేకుంటే వారి బంధం ఎక్కువ రోజులు సాగదు అని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జయ బచ్చన్ మాటలు సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక బిగ్ బి అమితాబ్ సతీమణి ఇలా మాట్లాడిందేంటి? అని షాక్ అవుతున్నారు నెటిజన్స్.