ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు ఏమాత్రం క్లోజ్‌గా ఉన్నా వారి మధ్య ఏదో ఉందని బోలేడు పుకార్లు షికారు చేస్తాయి. ఇక కొంత కాలం నుంచి పలువురు హీరోయిన్ల పెళ్లికి సంబంధించిన అనేక రూమర్లు ప్రచారం అయ్యాయి. రెండు మూడు రోజుల క్రితం వరకు హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్లి గురించి బోలేడు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అవన్ని అవాస్తవాలే అని తెలిసింది. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో యువ నటి చేరారు. ఆమె అభినయ. ఈ నటి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె మాట్లాడలేరు.. వినలేరు. కానీ నటన మీద అభినయకున్న ఆసక్తికి.. ఈ వైకల్యాలు అడ్డంకి కాలేదు. సినిమాల్లో ఆమె నటన చూస్తే.. ఆమెకు వినపడదు.. మాట్లాడలేదు అంటే ఎవరు నమ్మరు. అంత అద్భుతంగా నటిస్తుంది.
ఇప్పటివరకు అభినయ నటించే సినిమాలకు సంబంధించి తప్ప.. ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి వార్తలు మీడియాలో కానీ.. సోషల్ మీడియాలో కానీ రావడం చాలా అరుదు. అలాంటిది తాజాగా అభినయకు సంబంధించి ఓ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అది కూడా ఆమె పెళ్లి గురించి. దీనిపై అభినయ సిరీయస్ అయ్యింది. ఆ వివరాలు..
ప్రస్తుతం సౌత ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే.. టక్కున వినిపించే పేరు విశాల్. ఆయన పెళ్లి, ప్రేమ గురించి ఇప్పటికే మీడియాలో బోలేడు వార్తలు వచ్చాయి. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని ఆయన ప్రేమించారని.. వివాహం చేసుకుంటారని కొన్నేళ్ల పాటు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌మి మాత్రమే అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్ పలు సందర్భాల్లో ఈ వార్తలను ఖండించారు.
ఇక వీటికి చెక్ పెడుతూ.. విశాల్.. నటి, హైదరాబాద్‌కు చెందిన యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ నిశ్చితార్థం రద్దయ్యి.. వీరి వివాహం ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ తన కెరీర్ మీదనే పుల్ ఫోకస్ పెట్టారు. నటన, నిర్మాతగానే కాక.. చిత్ర పరిశ్రమకు చెందిన పలు సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అభినయను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీనిపై అభినయ కాస్త ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం తాను విశాల్ హీరోగా చేస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. రీల్ లైఫ్‌లో భార్యగా నటిస్తే.. నిజ జీవితంలో భార్య కాగలనా.. ఇలాంటి గాలి వార్తలు ఎలా ప్రసారం చేస్తారు అంటూ సీరియస్ అయ్యింది. దాంతో వీరిద్దరి పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.