శృంగారం అన్నది ఈ సృష్టిలో ఎంతో ముఖ్యమైన కార్యం. ప్రకృతిలోని అన్ని జీవులు శృంగారాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అలాంటి జీవుల్లో మనిషి అన్నిటి కంటే కొంత భిన్నంగా.. ఉన్నతమైన జీవిగా మారాడు. ఈ మానవ జాతి ఉద్భవించిన కొత్తలో శృంగారం అనేది కేవలం కొద్దిపాటి శారీరక సుఖం కోసం, సంతాన ఉత్పత్తి కోసం ఉండేది. తర్వాత కాలంలో శృంగారం అన్న పదానికి అర్థాలు మారిపోయాయి. భార్యాభర్తల సంబంధం అన్నది ఏర్పడ్డ తర్వాత శృంగారం పూర్తి స్థాయిలో మార్పులు సంతరించుకుంది. నేడు శృంగారం కేవలం సుఖపెట్టే అంశం మాత్రమే కాదు.. ఇద్దరి మధ్యా బంధాన్ని ధృడంగా ఉంచే అంశం కూడా. ఏ జంటల మధ్య శృంగార జీవితం ధృడంగా ఉంటుందో ఆ జంటలు అన్యోన్యంగా ఉంటున్నాయని చాలా సర్వేల్లో తేలింది.
శృంగార బంధం అనేది భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఓ మెట్టు పైకి తీసుకెళుతుంది. భార్య భర్తను సుఖపెట్టలేకపోయినా.. భర్త భార్యను సుఖపెట్టలేకపోయినా చాలా ఇబ్బందులు మొదలవుతాయి. అవి ఎన్నో దారుణాలకు తెరతీస్తాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మహిళల విషయంలో శృంగారం అన్నది చాలా స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది మగవాళ్లు రెండు నుంచి ఐదు నిమిషాల్లో సుఖాన్ని పొందగలుగుతారు. అది కేవలం అతడు వీర్యాన్ని పోగొట్టుకున్న సమయంలోనే భావప్రాప్తి కలుగుతుంది. అయితే, మహిళల విషయంలో అలా జరగదు. ఎందుకంటే భావప్రాప్తి పొందటం అన్నది మహిళల విషయంలో చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది.
దీనికి ప్రధాన కారణం భర్తకు శృంగారం ఎలా చేయాలో తెలీకపోవటం. అంతేకాదు! భార్యను సుఖం పెట్టడంలో లేదా ఆమెను ఎలా సుఖపెట్టాలో తెలుసుకోవటంలో భర్త ఫెయిల్ అవ్వటం. చాలా మంది భర్తలు కేవలం తమ సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇందువల్ల భార్యలు మానసికంగా, శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. భర్త శృంగారంలో భార్యను తృప్తి పర్చకపోవటం అన్నది కేవలం మహిళల్లో శారీరక సమస్య మాత్రమే కాదు.. మానసిక సమస్య కూడా. భర్త చేతకాని తనం కారణంగా భార్యలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. హార్మోన్ల ప్రభావం కారణంగా కోర్కెలు పెరుగుతూ ఉంటే.. వాటిని అదుపుచేసే విధంగా శృంగారం అన్నది ఉండాలి. అలా భర్త చేయకపోవటం వల్ల ఆమెలో అసంతృప్తి పేరుకుపోతుంది. రోజులు గడుస్తున్న కొద్ది ఆ అసంతృప్తి తీరని లోటుగా, బాధగా మారుతుంది. కొంతమంది దీనిగురించే ఆలోచిస్తూ నరకం అనుభవిస్తూ ఉంటారు.
మరికొంతమంది తృప్తి కోసం తప్పు దార్లు వెతుక్కుంటారు. అక్రమ సంబంధాలకు ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఓ మంచి శృంగారం కారణంగా ఆడవాళ్లకు చాలా లాభాలు ఉంటాయి. అది మానసికంగా కావచ్చు.. శారీరకంగా కావచ్చు. మంచి సెక్స్ కారణంగా నాచురల్ పెయిన్ రిలీఫ్ రసాయనాలు రిలీజ్ అవుతాయి. తద్వారా నొప్పుల వంటి వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే కాదు.. అండాల ఉత్పత్తి, నెలసరి సక్రమంగా రావటం, నొప్పులు తగ్గటం, యోని సంబంధిత సమస్యల నివారణ వంటివి జరుగుతాయి. మానసికంగా మహిళలకు ఓ ప్రశాంతత లభిస్తుంది. అది లేని నాడు ఒత్తిళ్లకు గురై నరకం అనుభవించాల్సి వస్తుంది. ఒత్తిడి ద్వారా ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.