ఐపీఎల్ 2022లో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను కొంత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్‌లో వార్నర్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అర్థసెంచరీ సాధించాడు. సీజన్‌లో వార్నర్‌కు ఇది ఐదో హాఫ్ సెంచరీ. మార్ష్(89)తో కలిసి వార్నర్(52*) కీలక సమయంలో ఢిల్లీని గెలిపించి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచాడు.
ఈ నేపథ్యంలోనే వార్నర్ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 400 పరుగుల మార్క్‌ను అందుకున్న జాబితాలో వార్నర్ టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లతో సమంగా నిలిచాడు. ఇప్పటివరకు వార్నర్ 8 సార్లు 400పై చిలుకు పరుగులు చేశాడు. కోహ్లి, ధావన్‌లు కూడా ఐపీఎల్‌లో 8 సార్లు ఈ మార్క్‌ను అందుకున్నారు. కాగా ఈ జాబితాలో సురేశ్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా ఏకంగా తొమ్మిదిసార్లు ఐపీఎల్‌లో 400 పైచిలుకు పరుగులు చేశాడు. వార్నర్ 2009లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. కానీ.. 2013లో సీజన్‌లో 400 పైచిలుకు పరుగుల మార్క్‌ను తొలి సారి అందుకున్నాడు.ఆ సీజన్‌లో వార్నర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబద్‌కు మారిన వార్నర్.. ఆరు సీజన్ల పాటు(మధ్యలో 2018 సీజన్‌లో వార్నర్ ఆడలేదు) 400కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. 2021 సీజన్‌లోనే వార్నర్ అంతగా రాణించలేదు. ఆ తర్వాత సన్‌రైజర్స్ నుంచి బయటికి వచ్చిన వార్నర్‌ను ఐపీఎల్ మెగావేలంలో రూ.6.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్‌లో వార్నర్ 9 మ్యాచ్‌ల్లో 427 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరి వార్నర్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSK vs Jadeja: జడేజాని టార్గెట్ చేసిన CSK యాజమాన్యం!
David Warner!#IPL2022 #DCvRR pic.twitter.com/RXpZcz5g1E
— RVCJ Media (@RVCJ_FB) May 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.