తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకుని ఏకంగా గర్భవతిని చేసిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరియలూర్ జిల్లా జయాన్‌కొండమ్ సమీపంలోని పెరియకరుక్కై గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ పిల్లలు మాత్రం కాలేదు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సు కండక్టర్ గా పని చేస్తున్న రాధాకృష్ణన్ స్థానికంగా పరమేశ్వరి అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త లేకపోవడంతో పరమేశ్వరి రాధాకృష్ణన్ తో కలిసి తెగ ఎంజాయ్ చేసేది. అలా వీరి కలయికలో తన ప్రియుడు ప్రియురాలి కూతురిపై కన్నేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నా బిడ్డలు లేరని, నీ కూతురిని చేసుకుని బిడ్డలు కంటానని రాధాకృష్ణన్ చెప్పడంతో ప్రియురాలు పరమేశ్వరి కూడా దీనికి సై అంటూ సమాధానం ఇచ్చింది. ఇక అనుకున్నదే పనిగా తన 13 ఏళ్ల మైనర్ కూతురిని ప్రియుడైన రాధాకృష్ణన్ కి ఇచ్చి ఎవరికి తెలియకుండా వివాహం చేసింది.
ఇక అప్పటి నుంచి ఆ బాలికను కండక్టర్ రాధాకృష్ణన్ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. అలా బలవంతంగా ఆ బాలికను రోజు హింసలకు గురి చేస్తుండడంతో కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఇక ఎట్టకేలకు బస్సు కండక్టర్ యవ్వరాన్ని అరియలూరు జిల్లా బాలల సంరక్షణ విభాగ అధికారి కార్తికేయన్‌కు బట్టబయలు చేశాడు. ఇక వెంటనే స్థానికంగా ఉంటే మహిళ పోలీసులకు కండక్టర్ చేసిన దుశ్చర్యపై ఫిర్యాదు చేశాడు.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
నిందితుడుపై పోక్సో చట్టం కింద కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఆ మైనర్ బాలిక తల్లి పరమేశ్వరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 41 ఏళ్ల బస్సు కండక్టర్ రాధాకృష్ణన్ చేసిన ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.