మనిషి అభివృద్ధి అనేది అతడి ఆలోచన పై ఆధారపడి ఉంటుంది. మనిషికి అనేక సందేహాలు వస్తుంటాయి. కొన్ని సందేహాలు అతడి అభిృద్ధికి తొడ్పడితే.. మరికొన్ని అతి సందేహాలు జీవితాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఓ యువకుడికి విచిత్రమైన సందేహం వచ్చింది. చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది అనే సందేహం కలిగిన ఆ యువకుడు… రహస్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నిచి.. చివరికి అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన సల్మాన్ అనే యువకుడు తరమణిలో ఉన్న లా కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు.స్థానికంగా ఓ ప్రైవేటు హాస్టల్ లో స్నేహితులతో కలిసి సల్మాన్ ఉంటుండేవాడు. అయితే సల్మాన్ మాత్రం సమాధానం దొరకని ఓ ప్రశ్న కోసం తీవ్రంగా శోధిస్తున్నాడు. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇక సల్మాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “మరణం తర్వాత ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను దాచిన రూ.5వేల నగదును అమ్మకు అప్పగించండి” అని ఓ లెటర్ రాశాడు.
ఇదీ చదవండి: భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని..చేయి నరికేసిన భర్త!గత కొన్ని రోజుల నుంచి సల్మాన్ సరిగ్గా ఎవరితోనూ మాట్లాడడం లేదని, ఏం జరిగిందని తెలుసుకునేందుకు హాస్టల్ లోని అతని గదికి వెళ్లే చూసే సరికి ఆత్మహత్య చేసుకుని విగతజీవిగా ఉన్నాడని స్నేహితులు తెలిపారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.