ప్రతి ఒక్కరు తాము ఎంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ భర్త, పిల్లలతో కలిసి హాయిగా జీవించాలని కోరుకుంటారు. అలా ప్రతి ఒక్కరి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. అయితే కొందరిపై విధి చిన్నచూపు చూస్తుంది. హాయిగా సాగిపోతున్న సంసారంలో విషాదం నింపుతుంది. తాజాగా ఓ మహిళ కూడా విధి ఆడిన వింత నాటకంలో బలైంది.
ప్రతి ఒక్కరు తాము ఎంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ భర్త, పిల్లలతో కలిసి హాయిగా జీవించాలని కోరుకుంటారు. అలా ప్రతి ఒక్కరి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. అయితే కొందరిపై విధి చిన్నచూపు చూస్తుంది. హాయిగా సాగిపోతున్న సంసారంలో విషాదం నింపుతుంది. తాజాగా భర్తతో సంతోషంగా జీవిస్తున్న మహిళపై విధికి కన్నుకుట్టింది. దీంతో ఆమెను కేబుల్ వైరల్ రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా వరదాపురం గ్రామానికి చెందిన నాగరాజు, కీర్తన భార్యాభర్తలు. వారికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ భార్యభర్తలకు ఒకరంటే మరొకరికి ప్రాణం. భర్త ఆఫీస్ కు వెళ్లాగానే భార్య ఇంటి పనులు చేసుకుంటూ.. సాయంత్రంకి అన్ని సిద్ధం చేసుకునేది. ఇలా సంతోషంగా సాగుతున్న వారి దాంపత్యాన్ని చూసి విధికి కన్నుకుటుంది. అందుకే కేబుల్ వైర్ రూపంలో మృత్యువు వచ్చి ఆ మహిళను బలి తీసుకుంది. కేబుల్ వైరల్ సమీపంలో బట్టలు ఆరవేయవద్దని భర్త ఎన్ని సార్లు చెప్పిన ఆమె పట్టించుకోలేదంటా. చివరకు అదే తప్పు చేసి.. తిరిగి రాని లోకాలపకు వెళ్లింది. శనివారం సాయంత్రం బట్టలు ఉతికి ఆరబెట్టేందుకు కీర్తన బయటకు వచ్చింది. బట్టలను ఆరేస్తున్న క్రమంలో కేబుల్ వైర్ కి తగిలి కరెంట్ షాక్ కొట్టింది.
కరెంట్ షాక్ కొట్టడంతో కీర్తన నేలపై పడిపోయింది. స్థానికులు గమనించి వెళ్లే సరికి ఆమె అప్పటికే మృతిచెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేబుల్ వైర్లు అడ్డదిడ్డంగా ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఈ ఘటనపై తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కీర్తన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేబుల్ ఆపరేటర్ వెంకటేశం నిర్లక్ష్యమే ఇలాంటి దారుణ ఘటనకు కారణంగానే కీర్తన మృతిచెందిందని గ్రామస్తులు వాపోతున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.