61 ఏళ్ల వృద్దుడు ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది ముంబైలోని వర్లి ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ఓ 61 ఏళ్ల వృద్దుడు స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే ఈ క్రమంలోనే స్థానిక మహిళతో ఆ వృద్దుడికి సంబంధం ఉంది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ తెగ ఎంజాయ్ చేసేవారు. ఇక అప్పడప్పుడు సరదాగా గడిపేందుకు హోటల్ కు కూడా వెళ్లేవారట. ఇక తాజాగా ఇందులో భాగంగానే ఇద్దరు కలిసి మరోసారి ముంబైలోని కుర్లా ప్రాంతంలోని ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక కాసేపు ఇద్దరు ఏకాంతంగా గడిపారు. ఇక హఠాత్తుగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కంగుతున్న ప్రియురాలికి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఇది కూడా చదవండి: Identical Twins: వారిద్దరూ కవలలు. తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న! ఏకంగా 6 నెలలు!వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక అనంతరం ఆ ప్రియురాలిని ప్రశ్నించగా ఏకాంతంగా గడుపుతూ మద్యం తాగేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.