ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌లు ఎక్కువయిపోయాయి. సామాన్య ప్రజలనుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీల వరకు అందరూ హనీ ట్రాప్‌కు గురవుతున్నారు. కొంతమంది మోసగత్తెలు పురుషులతో నమ్మకంగా మెలిగి తమ ప్రతాపం చూపిస్తున్నారు. మరి కొంతమంది మోసగత్తెలు పరిచయం లేకపోయినా తమ అందంతో ఎరవేసి మోసాలు చేస్తున్నారు. తాజాగా, ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఓ యువతి చుక్కలు చూపించింది.
కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ వచ్చింది. ఆయన ఆ కాల్‌ను లిఫ్ట్ చేశాడు. ఎవరు? అని ప్రశ్నించాడు. అవతలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆయన ఫోన్ కట్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత మరో సారి వీడియో కాల్ వచ్చింది. ఆయన మళ్లీ కాల్ లిఫ్ట్ చేశాడు. ఈసారి అవతలినుంచి ఓ యువతి దర్శనమిచ్చింది. ఆ యువతి తిప్పారెడ్డితో మాట్లాడుతూ తన ఒంటిపై దుస్తులు ఒక్కొక్కటిగా విప్పటం మొదలుపెట్టింది. దీంతో ఆయన కంగారు పడ్డాడు. వెంటనే ఫోన్‌ను తన భార్యకు ఇచ్చాడు.
ఆమె వీడియో కాల్‌లోని యువతి అవతారం చూసి వెంటనే కాల్ కట్ చేసింది. అయితే, ఆ మహిళ అంతటితో ఆగలేదు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఓ వీడియోను ఆయనకు పంపింది. ఆ వీడియోను చూసిన ఆయనకు చిరాకు వేసింది. ఆ తర్వాత ఆ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. తనపై ఏదో కుట్ర జరుగుతోందని ఆయన గుర్తించాడు. అక్టోబర్ 31న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వెంటనే ఆయన సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వాట్సాప్ వీడియోకాల్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.