అది ఆదివారం ఉదయం 10 గంటల సమయం. వీధిలో జనాలంతా ఎవరి పనుల్లో వారి బిజీగా ఉన్నారు. సుజాత కూడా ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఇక ఈ క్రమంలోనే కొందరు దుండుగులు పట్టపగలు ఆ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. వంట చేస్తున్న సుజాత వెనకాల నుంచి సైలెంట్ గా వెళ్లి చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పట్టపగలు ఆ యువకులు ఎందుకు ఆ మహిళ ఇంట్లోకి వెళ్లారు? తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టి గ్రామం. ఇక్కడే వెంకటేష్, సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక భార్యాభర్తలు స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం భార్యాభర్తలు ఎప్పటిలాగే కూరగాయల మార్కెట్ కు వెళ్లారు. సమయం 10 గంటలకు వంట చేసుకుని వస్తా అని సుజాత భర్తకు చెప్పి ఇంటికెళ్లింది. ఇంటికెళ్లిన సుజాత తన పని తాను చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే కాపుకాసిన కొందరు గుర్తు తెలియని దుండుగుల సుజాత ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆ దుండగులు ఆ మహిళ గొంతు కోసి చంపి, ఆమె దగ్గర ఉన్న అన్నీ బంగారు నగాలు తీసుకుని అక్కి నుంచి పరారయ్యారు.
వంట చేసి వస్తానని చెప్పిన భార్య ఇంకా రాకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చాడు. ఇక తలుపు తెరిచి చూడగా భార్య రక్తపు మడుగలో పడి ఉండడం చూసి భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏం జరిగిందో తెలియక భర్త కన్నీ సంద్రంలో మునిగిపోయారు. స్థానికులు అంతా సుజాత వద్దకు చేరి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై భర్త వెంకటేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుజాత మృతదేహాన్ని పరిశీలించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.