ఆ మహిళ కొన్ని కారణాల వల్ల మనీశ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలం తర్వాత భర్తకు అసలు విషయం తెలియడంతో భార్యను దారుణంగా హత్య చేశాడు.
ఝార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య శవాన్ని తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు. 2021లో జరిగిన ఈ దారుణ హత్య కేసులో తాజాగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను చంపి తన స్నేహితుడి ఇంట్లో ఎందుకు పాతిపెట్టాడు? ఏడాది తర్వాత ఈ కేసులో తెలిసిన అసలు నిజాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ గిరిడీ ప్రాంతంలో అర్జుమన్ బానో అనే మహిళ కొన్ని కారణాల వల్ల మనీశ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలం తర్వాత ఆ మహిళ తన మొదటి భర్త సోదరుడితో తరుచు ఫోన్ లో మాట్లాడుతుంది. అయితే ఇదే విషయం మొదటి భర్త అయిన మనీశ్ కు తెలిసింది. దీంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఇలాంటి పనులు చేయొద్దని భర్త మనీశ్ భార్య అర్జుమన్ బానోకు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య బుద్ది మాత్రం మార్చుకోలేదు. దీంతో భార్య తీరుతో భర్తకు చిర్రెత్తుకొచ్చింది.
ఇలా అయితే కాదనుకున్న భర్త మనీశ్… భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య అర్జుమన్ బానో శవాన్ని మాల్దాకు తీసుకెళ్లి తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా సిమెంట్ తో ప్లాస్టింగ్ చేసి చేతులు దులుపుకున్నాడు. అయితే రెండు నెలల తర్వాత భర్త మనీశ్.. నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి తల్లిదండ్రులు.. మా కూతురు అర్జుమన్ బానోను అతని భర్త మనీశ్ హత్య చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అర్జుమన్ బానో భర్త మనీశ్ ను విచారించారు.
అయితే మనీశ్ మొదట్లో తనకేం సంబంధం లేదని చెప్పాడు. ఇక చివరికి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సైతం ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా విచారించే సరికి భర్త మనీశ్.. నా భార్యను నేనే చంపి మాల్దాలో ఉన్న నా స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టానని తెలిపాడు. అయితే ఇటీవల పోలీసులు పాతిపెట్టిన స్థలంలో తవ్వి చూడగా.. అర్జుమన్ అస్థిపంజరం బయటపడింది. ఈ విషయం తెలుకున్న అర్జుమన్ బానో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు మనీశ్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.