DRUGS : హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసై ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు తరచూ గోవా వెళ్లి డ్రగ్స్ తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌కు అలవాటు పడి రోగిగా మారాడు. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఇలా డ్రగ్స్‌కు బానిపై ఓ వ్యక్తి మరణించటం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. విద్యార్థి మరణంతో రంగంలోకి దిగిన పోలీసులు గోవానుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న యువకులను అరెస్ట్ చేశారు. చనిపోయిన యువకుడు కూడా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు.
కాగా, సాధారణంగా డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా చాలా మంది చనిపోతుంటారు. ఈ నెల 7వ తేదీన 23 ఏళ్ల ఓ యువతి డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మరణించింది. బ్యూటీ థెరపిస్ట్‌గా పని చేస్తున్న రోసీ డ్రగ్స్‌కు బానిసైంది. 7వ తేదీ రాత్రి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకుంది. దీంతో ఆపస్మారక స్థితిలోకి చేరుకుంది. కొద్దిసేపటి మరణించింది. ఆఫీసునుంచి రూముకు వచ్చిన ఫ్రెండ్ వాష్ రూమ్ తలుపులు పగుల కొట్టగా రోసీ అచేతనంగా కనిపించింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. హైదరాబాద్‌లో తొలి డ్రగ్స్ మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గర్భంతో ఉన్న మేకపై ముగ్గురు వ్యక్తుల దారుణం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.