గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గి రూ.48,740 (10 గ్రాములు)కి చేరుకుంది. ఇక 24 క్యారెట్లపై కూడా రూ.10 తగ్గి రూ.53,170 (10 గ్రాములు)కి చేరింది. మరోవైపు వెండి ధర నిన్నటితో పోలిస్తే కిలోకు రూ.300 తగ్గి రూ.61,900కి చేరింది. బులియన్ మార్కెట్లో మార్పులను బట్టి దేశంలో బంగారం ధరలో ప్రతిరోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,180గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,740గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170గా ఉంది. అలాగే.. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,790 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,220గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,340గా ఉంది. వాణిజ్య నగరమైన ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,740గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,170గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000గా ఉండగా, విజయవాడలో రూ.67,00గా, చెన్నైలో రూ.67,000గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,900గా ఉండగా, ముంబైలో రూ.60,900, కోల్‌కతాలో రూ.60,900గా, బెంగళూరులో రూ.67,000గా ఉంది.
బంగారం స్వచ్ఛతను చెక్ చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘బిఐఎస్ కేర్ యాప్’ ఉపయోగించండి. ఈ యాప్ సాయంతో బంగారం స్వచ్ఛతను చూసుకోవడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా రిజిస్టర్ చేయవచ్చు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అండ్ హాల్‌మార్క్ నంబర్ తప్పు అని తేలితే కస్టమర్లు వెంటనే ఈ యాప్ నుండి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీ ఫిర్యాదు గురించిన సమాచారం కూడా పొందవచ్చు.