సోషల్ మీడియాలో ఓ వీడియో గత రెండు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం ఓ దివ్యాంగురాలి పింఛన్ తొలగించిందని.. కోపంతో ఆమె డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియో నెట్టింట షేర్ చేశారు. అసలు నిజం ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ బయటపెట్టింది.
ఈ రోజుల్లో ఫేక్ ప్రచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మనకు పడనివారు తప్పుడు ప్రచారాలను జనాల్లోకి నిమిషాల్లో షేర్ చేస్తున్నారు. ఏది నిజమో.. ఏది అబద్దమో.. కూడా తెలియనంతగా జనాల్లోకి వెళ్లిపోతుంది. నెటిజన్లు కూడా ఏది ఫేక్ న్యూసో తెలుసుకోకుండా షేర్ కొట్టేస్తుంటారు. ఏపీలో ఫ్యాక్ట్ చెక్ టీమ్‌లు అసలు జరిగిన సంగతి ప్రజల ముందు పెడుతోంది. అసలు నిజం తెలిసేలోపే ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా జగన్ సర్కార్ ఓ దివ్యాంగురాలి పింఛన్ తొలిగించిందంటూ ఫేక్ వీడియోతో ప్రచారం కొనసాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీకి చెందిన ఓ దివ్యాంగురాలి పేరు అరుంధతి. ఏపీ ప్రభుత్వం అరుంధతి పెంఛన్ తొలగించిందని కొందరు వీడియో పోస్ట్ చేశారు. ఆ యువతికి గత ప్రభుత్వం పింఛన్ ఇచ్చేదని.. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని ఇప్పుడున్న ప్రభుత్వం పింఛన్ తొలగించినట్లు వీడియోలో ప్రచారం చేశారు. దీనిని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఒరిజినల్ వీడియోను మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్దారించింది. దీనిని పరిశీలించాలని కోరింది.
అసలు వాస్తవం ఏంటంటే.. ఒడిశాలో ఓ దివ్యాంగురాలు కృష్ణ భజన పాటలకు డ్యాన్స్ చేసిన సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి ఇలా దుష్ర్పచారం చేశారని తెలిపింది. ఒరిజినల్ వీడియో లింక్‌ను షేర్ చేసింది. కొంతమంది ఈ ఫేక్ వీడియోలను షేర్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు వీడియో గురించి నిజానిజాలు తెలియకుండా షేర్ చేశారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. ఇటువంటి వీడియో విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అసలు నిజాలను తెలుసుకున్న పిదప పోస్ట్ చేయాలని సూచించింది.
The morphed video published by Mahaa News is deplorable.
The specially abled girl is dancing to the tunes of a Krishna Bhajan during #RathaYatra celebrations in Odisha. The video has been morphed.
The original video link is here: https://t.co/wW0FQLZDBj pic.twitter.com/KPfDXm0qSR
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) July 4, 2023