సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ శాండల్ వుడ్ స్టార్ ఉదయ్ హుట్టినగడ్డే.. జూన్ 2న కన్నుమూశారు. 61 ఏళ్ళ వయసులో నటుడు ఉదయ్ బెంగుళూరు(రాజాజీనగర్)లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్లుగా నరాలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ చనిపోయినట్లు సినీవర్గాల సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఉదయ్ హుట్టినగడ్డే.. 1987లో ‘ప్రారంభ’ అనే చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జయభేరి, అమృత బిందు, శివయోగి అక్కమహదేవి, క్రమా, […]