Fire Accident: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రథోత్సవంలో విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంతో 10 మంది భక్తులు సజీవదహనం అయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరు దగ్గర్లోని కలిమేడులో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి తిరునారుకరసు స్వామి 94వ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథోత్సవం నిర్వహిస్తుండగా రథం పైన ఉన్న హైటెన్షన్ తీగలను తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుతాఘాతం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా మంటలు […]