Fire Accident: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రథోత్సవంలో విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంతో 10 మంది భక్తులు సజీవదహనం అయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరు దగ్గర్లోని కలిమేడులో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి తిరునారుకరసు స్వామి 94వ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రథోత్సవం నిర్వహిస్తుండగా రథం పైన ఉన్న హైటెన్షన్ తీగలను తాకింది.
దీంతో ఒక్కసారిగా విద్యుతాఘాతం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా మంటలు చెలరేగి 10 మంది భక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district in Tamil Nadu pic.twitter.com/F4EdBYb1gV
— ANI (@ANI) April 27, 2022
ఇవి కూడా చదవండి : బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు.. లోపల 26మంది.. అద్దాలు పగులగొట్టి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.