‘గోపాలా గోపాలా’ సినిమాలో దేవాలయంలో విగ్రహంపై పాలను పోయడంపై ఓ సన్నివేశం ఉంటుంది. దేవుడికి అభిషేకం చేసే పాలను యాచకుడికి ఇస్తాడు వెంకటేశ్. అలా అతని ఆకలి తీర్చగలిగానంటూ వెంకటేశ్ భావోద్వేగంతో డైలాగ్ చెప్తాడు. అచ్చు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్నాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా దేవాలయాల్లో వృథాగాపోయే పాలను సేకరించి బస్తీల్లోని పేద ప్రజలకు పంచుతున్నాడు ఓ డెబ్బైఏళ్ల వృద్ధుడు. ఎంతో మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు. 2012 జనవరి 26న ‘ఇండియన్ మిల్క్ […]