Viral Video: చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ మధ్య చాలా మందికి సెల్ఫీల పిచ్చి పట్టుకుంది. నచ్చితే.. కొంత వింతగా అనిపిస్తే చాలు సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకోవటంలో బిజీ అయిపోతున్నారు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగిస్తున్నారు. ఈ సందర్భంలోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా, ఓ రైలు నుంచి వేలాడుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు కిందపడిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ముంబైకి చెందిన ఓ యువకుడు తన మిత్రులతో కలిసి డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. అది కూడా తలుపులు మూసిఉన్న మోటార్ క్యాబిన్ బయట వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. సాధారణంగా అలా వేలాడుతూ ప్రయాణించటం చాలా ప్రమాదకరం. అయితే, ఆ యువకుడు ఆ ప్రమాదాన్ని మరిచాడు.
వేగంగా దూసుకుపోతున్న రైలునుంచి తనను తాను సెల్ఫీ వీడియో తీసుకోవటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడి చెయ్యి సిగ్నల్ పోస్ట్‌కు తగిలింది. దీంతో ఠక్కున కింద జారి పడ్డాడు. ఈ రైలు ప్రయాణిస్తున్న పట్టాలకు అటువైపు ఉన్న పట్టాలపై ప్రయాణిస్తున్న మరో రైలులో ఉన్న ప్రయాణికులు దీన్నంతా వీడియో తీశారు. సెల్ఫీ వీడియో తీయటానికి ప్రయత్నించి, ప్రమాదానికి గురైన యువకుడ్ని ఓ పిచ్చి వాడిలా పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గురైన ఆ కుర్రాడు మరి బతికి ఉన్నాడో లేక, ప్రాణాలు కోల్పోయాడో తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) June 23, 2022
ఇవి కూడా చదవండి : Video:మనుషుల్ని చంపి.. మామిడి చెట్టు ఎక్కి నిద్రిస్తున్న చిరుత..! వీడియో వైరల్