యూట్యూబ్.. నెలలు నిండిన పసివాళ్ల నుంచి.. వృద్దుల వరకు ప్రతి ఒక్కరికి వినోద సాధనంగా మారింది. వంటలు మొదలు వాషింగ్ మెషిన్ రిపేర్ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ ఏది లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే వేదికగా మాత్రమే కాక.. ఎందరికో ఆదాయ వనరుగా మారింది యూట్యూబ్. ప్రస్తుతం ఇది కొన్ని కోట్ల మందికి ఆదాయం అందిస్తోంది అన్న మాట వాస్తవం. ఇక ప్రతిభ ఉండి.. దాన్ని ప్రదర్శించేందుకు సరైన అవకాశాలు, వేదిక దొరకని వారికి యూట్యూబ్ సరైన ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఎంతోమంది సొంతంగా యూట్యూబ్‌లో చానెల్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. గుర్తింపుతో పాటు.. ఆదాయం కూడా పొందుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు యూట్యూబర్ పెళ్లికి సబ్‌స్క్రైబర్స్ నాలుగు కోట్ల రూపాయలకు పైగా కట్నాలు పంపడం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. యూట్యూబ్‌లో యాక్టీవ్‌గా ఉండే వారికి క్రియేటివ్ థింక్స్ యూట్యూబ్ చానెల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వ్లాగ్స్, షార్ట్ ఫిల్మ్, వీడియోలు చేస్తూ.. మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ ఛానెల్ నిర్వాహకుడు శ్రీ గురించి కూడా చాలా మంది నెటిజనులకు తెలుసు. తాజాగా శ్రీ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి.. తమను ఆశీర్వదించాల్సిందిగా కోరాడు.
ఈ క్రమంలో సబ్‌స్క్రైబర్స్ నూతన దంపతులకు ఆశీర్వాదం తెలిపి.. కట్నాలు పంపించారు. ఈ మొత్తం సుమారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉండటం విశేషం. ఈ విషయాన్ని సదరు చానెల్ నిర్వాహాకుడు కామెంట్స్ సెక్షన్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమను ఆశీర్వదిస్తూ.. సుమారు 23 వేల పైచిలుకు మంది.. 4 కోట్ల రూపాయలకు పైగా కట్నాలు పంపినట్లు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయడంతో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే.. ఇక్కడ 4 కోట్ల రూపాయల కట్నం అంటే.. సబ్ స్క్రైబర్స్ నిజంగా వారికి అమౌంట్ పంపలేదు. ఆ యూట్యూబర్ మీరు పంపాలి అనుకున్న అమౌంట్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి చాలు. దాన్నే నేను డబ్బుగా భావిస్తాను. ఎందుకంటే సబ్ స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ లా భావిస్తాను అంటూ ఆ యూట్యూబర్ చెప్పుకొచ్చాడు. సో.. ఇక్కడ 4 కోట్లు అంటే డబ్బు కాదు, ఆ యూట్యూబర్ పై ప్రేక్షకులు చూపించే ప్రేమ అన్నమాట. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.