బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. హైదరాబాద్‌లో ఆపరేషన్ ఆకర్ష్ విఫలమయింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో నగర శివార్లలోని పీవీఆర్ ఫాం హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు, కోట్లలో నగదు పట్టుబడింది. పట్టుబడిన వారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లు ఉండగా, ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిగా తెలుస్తోంది..
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షనర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఫామ్ హౌస్‌లో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లతో మాట్లాడుతూండగా పోలీసులు దాడి చేశారు. తర్వాత వారు అక్కడినుంచి వెళ్లిపోాయారు. పోలీసులు ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. ఈ దాడిలో రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి ఢిల్లీకి చెందిన ఓ పీఠాధిపతిగా పోలీసులు భావిస్తున్నారు. సింహయాజులు కూడా స్వామజీ వేషధారణలో ఉన్నారు. నందకుమార్.. అంబర్ పేటకు చెందిన ఓ జాతీయ పార్టీ నేత అని తెలుస్తోంది. నందకుమార్ మధ్యవర్తిగా.. నలుగుురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కోసం బేరం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ విషయంపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పక్కా సమాచారంతోనే రైడ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ప్రలోభపెడుతున్నట్లు ఎమ్మెల్యేలు సమాచారమిచ్చినట్లు సీపీ వెల్లడించారు. వీరిచ్చిన సమాచారంతోనే ఫామ్‌హౌజ్‌పై రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో తిరుపతి నుంచి వచ్చిన స్వామిజీ సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ రామచంద్రభారతితో ఉన్నారని సీపీ వివరించారు. వీరు ముగ్గురూ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్.. పోలీసులకు దొరికిపోయిన మధ్యవర్తులు.. కోట్లలో డబ్బు స్వాధీనం pic.twitter.com/o3WCAvpFaN
— Govardhan Reddy (@gova3555) October 26, 2022