స్టార్ క్రికెటర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడం సహజం. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్లు ఏం చేసినా అవి బ్లైండ్ గా ఫాలో అయ్యే డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉండగా ఒక యాడ్ కోసం సచిన్ ని సంప్రదించగా..ఫ్యాన్స్ కోసం ఏకంగా బ్లాంక్ చెక్ నే రిజెక్ట్ చేయడం విశేషం.
భారత్ క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్థానం ప్రత్యేకం. ఎన్నో సార్లు టీంఇండియాకి ఒంటి చేత్తో విజయాలందించిన ఘనత సచిన్ ది. తన క్లాస్ బ్యాటింగ్ తో రికార్డులన్నీ బద్దలు కొట్టిన టెండూల్కర్.. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఫాలోయింగ్ ఎంత ఎక్కువగా ఉంటే మార్కెట్ లో డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో మాస్టర్ బ్లాస్టర్ ని ఒక యాడ్ కోసం సంప్రదించగా..ఈ ఆఫర్ ని తిరస్కరించారంట. ఈ యాడ్ కోసం సచిన్ కి ఏకంగా బ్లాంక్ చెక్ నే అందించగా ఫ్యాన్స్ కోసం సచిన్ ఒప్పుకోలేదు. మరి ఇంతకు ఆ యాడ్ ఏంటి? సాచి ఈ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసాడో ఇప్పుడు చూద్దాం.
స్టార్ క్రికెటర్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడం సహజం. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్లు ఏం చేసినా అవి బ్లైండ్ గా ఫాలో అయ్యే డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. కానీ సచిన్ మాత్రం ఫ్యాన్స్ కోసం తీసుకున్న ఒక నిర్ణయం అతన్ని మరో స్థాయిలో నిలబెడుతుంది. గతంలో టొబాకో యాడ్ చేయవలసిందిగా సచిన్ ని కోరారు. అయితే సచిన్ ఈ యాడ్ చేస్తే దేశంలో ఉన్న ఎంతో అభిమానులు అతన్ని ఫాలో అవ్వడం గ్యారంటీ. దీంతో సచిన్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది. నిన్న టొబాకో డే సందర్భంగా సచిన్ ఈ విషయాన్ని గూర్చి మాట్లాడాడు.
” టొబాకో కంపెనీ నుంచి యాడ్ చేయవలసిందిగా నాకు ఆఫర్ వచ్చింది. ఈ యాడ్ కోసం ఏకంగా నాకు బ్లాంక్ చెక్ ని ఆఫర్ చేశారు. కానీ నేను మా నాన్నకు ఇలాంటి యాడ్స్ చేయనని ప్రామిస్ చేసాను. నేను ఈ యాడ్ చేస్తే నన్ను రోల్ మోడల్ గా తీసుకున్నవారికి నేను అన్యాయం చేసినట్టవుతుంది”. అని సచిన్ చెప్పుకొచ్చాడు. పొగాకు తాగడం వలన లంగ్స్ ప్రమాదానికి గురవుతాయి. వీటి మీద అవగాహన కలిగిస్తూ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలు వస్తున్నా.. ఫ్యాన్స్ కోసం సచిన్ ఆఫర్ రిజెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.