అందరిలానే ఆ పిల్లాడు కూడా చిన్నప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టపడ్డాడు. కానీ ఆ ఇష్టాన్ని ఆటపై చూపించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఎవరూ కనీసం ఉహించని రేంజ్ కి చేరిపోయాడు. టీమిండియానే గర్వపడేలా చేశాడు. ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్ గా మారాడు. సచిన్ ని స్పూర్తిగా తీసుకున్న ఆ పిల్లాడు.. పెరిగి పెద్దయిన తర్వాత అతడితో కలిసి ఆడాడు. ప్రపంచకప్ గెలిచిన మాస్టర్ ని భుజాలపై ఎత్తుకుని తిరిగాడు. ఇప్పుడు మాస్టర్ మాత్రమే కాదు అందరూ మెచ్చుకునే అద్భుతమైన క్రికెటర్ గా ఫేమ్ సంపాదించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి విరాట్ కోహ్లీ. కింగ్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఇతడు.. టీమిండియా చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. మైదానం, ఫార్మాట్ తో సంబంధం లేకుండా రన్ మెషిన్ అనే బిరుదు సంపాదించాడు. అలాంటి విరాట్ కోహ్లీ.. శనివారం 34వ పుట్టినరోజు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ వైరల్ గా మారాయి. అలానే కోహ్లీకి సంబంధించిన కొన్ని విషయాలు చర్చనీయాంశమయ్యాయి.
ఇక కోహ్లీ నిక్ నేమ్ చీకూ. అతడికి బాగా దగ్గర వాళ్లందరూ అలానే పిలుస్తారు. 2008లో అండర్-19 విజేతగా టీమిండియా నిలవడంలో కెప్టెన్ కోహ్లీ మెయిన్ రీజన్. ఇక అక్కడి నుంచి విరాట్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2008లో శ్రీలంకతో.. కోహ్లీ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అందులో 12 పరుగులే చేశాడు. అత్యంత వేగంగా 8000, 9000, 10000, 11000, 12000 పరుగుల రికార్డు కోహ్లీ పేరిట ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 71 సెంచరీలున్నాయి. సచిన్ తర్వాత మనోడే ఈ జాబితాలో ఉన్నాడు.
ఇకపోతే కెప్టెన్ గా టెస్టుల్లో 7 డబులు సెంచరీలు చేసిన విరాట్… ప్రపంచంలోనే మరే కెప్టెన్ కు సాధ్యం కానీ ఘనత సాధించాడు. మన జట్టుకు 27 టెస్టు విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ కూడా కోహ్లీనే. ఇక అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న లాంటి క్రీడా పురస్కారాలు కూడా కోహ్లీని ఎప్పుడో వరించాయి. ఐసీసీ ప్లేయర్ అవార్డులు కూడా ఎన్నో గెలుచుకున్నాడు. ఇక 2017లో హీరోయిన్ అనుష్క శర్మని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు వామిక అనే అమ్మాయి ఉంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీ.. అద్భుతమైన ఫామ్ తో అదరగొడుతున్నాడు.
Wish u very happy birthday King Kohli 👑❤️
Love you lot ❣️😘😘#HappyBirthdayViratKohli #ViratKohli𓃵 #Kohli #GOAT𓃵 pic.twitter.com/1Fd4PeiZAr— 🥰😘😘 (@GaganaS16550773) November 5, 2022
Wishing you a Happiest Birthday’s #Beast @imVkohli 🖤 #Kohli #KingKohliBirthdayCDP #KingKohli #HappyBirthdayViratKohli pic.twitter.com/S9j8C22NQD
— Jagadeesh Seepana🇮🇳 (@Jagadeeshorigin) November 5, 2022
Happy Birthday King… 🎂🏏🎂#KingKohli #KingKohliBirthday #ViratKohli𓃵 #ViratKohli #Kohli pic.twitter.com/3kDa6FAUWb
— Ashish Mishra (@AshishMisraRBL) November 5, 2022
Happy birthday virat…
You’re the hero of Indian cricket team…
You’re the backbone of bcci#KingKohliBirthdayCDP @imVkohli #Kohli pic.twitter.com/rJxK86NjF2— Pratyush Pandey (@Pratyus11538413) November 5, 2022
In 2006, #ViratKohli𓃵’s father passed away while he was playing for Delhi in the #RanjiTrophy at age 18!
His father’s demise did not deter his passion for cricket.#Kohli returned, scored 90 runs, and attended the funeral.
The rest is history!#HappyBirthdayViratKohli pic.twitter.com/bvEaZro5Lr
— P C Mohan (@PCMohanMP) November 5, 2022