మ్యాచ్ ఆడితే ఇలా ఉండాలి. క్రీజ్‌లోకి వచ్చిన ప్రతి బ్యాటర్ బౌలర్లపై విరుచుకుపడాలి. ఒకరిద్దరు ఆడితే కాదు.. ఇలా బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరు పరిస్థితులకు తగ్గట్లు, తమ నైపుణ్యాలను చూపిస్తూ ఆడితే టీమిండియాను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇదే విషయాన్ని ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20తో భారత బ్యాటర్లు నిరూపించారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కూడా రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌తో రికార్డుల మోత మోగింది. జట్టుతో పాటు సూర్యకుమార్ యాదవ్, కింగ్ కోహ్లీ సైతం వారివారి ఖాతాల్లో అరుదైన రికార్డులను వేసుకున్నారు. అవి అలాంటిలాంటి రికార్డులు కూడా కావు. దాదాపు వేరే ఆటగాళ్లకు అసాధ్యం అనిపించే రికార్డులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చరిత్ర సృష్టించిన టీమిండియా..
భారత గడ్డపై సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 సిరీస్‌ను ఓడిపోలేదు. చివరి టీ20 సిరీస్‌లో వర్షం కారణంగా ఐదో మ్యాచ్ రద్దు కావడంతో ఆ సిరీస్ సమంగా నిలిచింది. కానీ.. ఆదివారం గౌహతీలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. దీంతో తొలి సారి సౌతాఫ్రికాపై టీమిండియా తన సొంత గడ్డపై సిరీస్ విజయం సాధించింది.
సూర్య వరల్డ్ రికార్డ్, కోహ్లీ అరుదైన రికార్డ్..
ఆదివారం మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా.. ఈ మైలురాయిని చేరుకోవడానికి సూర్య కేవలం 573 బంతు మాత్రమే తీసుకున్నాడు. ఇంత తక్కువ బంతుల్లో టీ20ల్లో వెయ్యి పరుగులు చేసిన మరో ఆటగాడు లేడు. 573 బంతుల్లో 1000 పరుగులు చేసిన సూర్య వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. టీ20 క్రికెట్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20 11వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ కోహ్లీనే. ఇలా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20తో టీమిండియా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించారు.
Virat Kohli becomes the first Indian to get to 1⃣1⃣0⃣0⃣0⃣ T20 runs 👏👏#TeamIndia pic.twitter.com/2LZnSkYrst
— BCCI (@BCCI) October 2, 2022
1000 runs and counting in T20Is for @surya_14kumar 💥💥#SuryakumarYadav#INDvsSA
He is the third fastest Indian batter to achieve this feat.#TeamIndia pic.twitter.com/vJV7JGE0oX— प्रिन्स यादव (@Yadavprince18) October 2, 2022
ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీ, రోహిత్‌లకు తీవ్ర అవమానం!