ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఆ జట్టుతో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు ఇటివల జట్లను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లకు జట్టులోని స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకు రెస్ట్ ఇచ్చినట్లు ప్రకటించిన సెలెక్టర్లు దినేష్ కార్తీక్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు రెస్ట్ ఇచ్చిన ఆటగాళ్లను బంగ్లాతో వన్డే, టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేశారు. ఈ నాలుగు సిరీస్‌లలో ఏ ఒక్క జట్టులో కూడా దినేష్ కార్తీక్ కు చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్‌లో డీకే నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన రాకపోవడంతోనే అతనిపై వేటు వేశారని వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2022కు ముందు దినేష్ కార్తీక్‌పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. డీకే దాదాపు క్రికెట్‌కు దూరం అయిపోయడనే అంతా భావించారు. కానీ.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడిన డీకే.. ఫినిషర్ రోల్లో అద్భుతంగా రాణించాడు. అదే సమయంలో టీమిండియా ఫినిషర్ రోల్ ఖాళీగా ఉండటం.. పంత్ పూర్ ఫామ్, హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడంతో డీకే తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు పలు సిరీస్‌లలో డీకే రాణించడంతో.. వరల్డ్ కప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. కానీ.. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో డీకే నుంచి ఆశించినంత స్థాయి ప్రదర్శన రాలేదు. అందుకే వరల్డ్ కప్ తర్వాత జరిగే రెండు సిరీస్‌లకు డీకేను ఎంపిక చేయలేదనట్లు తెలిసిందే.
అయితే ఈ విషయంపై సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ స్పందిస్తూ.. దినేష్ కార్తీక్‌ను జట్టు నుంచి తొలగించి అతనిపై వేటు వేయలేదు.. కేవలం వర్క్‌లోడ్‌లో భాగంగానే అతనికి రెస్ట్ ఇచ్చాం. వరల్డ్ కప్ తర్వాత వెంటనే టీ20 సిరీస్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇతర ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. అంతే కానీ.. డీకే స్థానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భవిష్యత్తులో అతనికి అవకాశాలు ఉంటాయి. అతని కోసం సెలెక్షన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. అతని జట్టులోకి వచ్చిన విధానం ఎంత గొప్పగా ఉందో అంతా చూశాం. అతనో అద్భుతమైన ఆటగాడు’ అని చేతన్ శర్మ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో దినేష్ కార్తీక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Chief selector Chetan Sharma explained the reason for not including Dinesh Karthik in the squad for New Zealand tour.#T20WorldCup https://t.co/feUwix6i0D
— CricTracker (@Cricketracker) November 2, 2022