గత కొంత కాలంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కాలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు మరణించారు. టాలీవుడ్ దిగ్గజాలు రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణతో పాటుగా తాజాగా గుండెపోటుతో ప్రముఖ నటుడు చలపతి రావు సైతం మరణించారు. దాంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ లో విషాదం నెలకొంది. దిగ్గజ ఆటగాడు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంట విషాదం నెలకొంది. గవాస్కర్ తల్లి మీనల్ గవాస్కర్ (95) ఆదివారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణవార్త విన్నప్పటికీ ఆటపై తనకు ఉన్న కమిట్మెంట్ ను చూపించాడు గవాస్కర్. తల్లి మరణించినా గానీ ఇండియా-బంగ్లా మ్యాచ్ లో కామెంటరీ చేశాడు.
సునీల్ గవాస్కర్.. టీమిండియా దిగ్గజ క్రికెటర్ గా, కామెంటేటర్ గా వరల్డ్ వైడ్ గా సుపరిచితుడు. ప్రస్తుతం భారత్-బంగ్లాతో మ్యాచ్ కు సైతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సునీల్ గవాస్కర్ తల్లి మీనల్ గవాస్కర్ (95) మరణించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది మీనల్. అదీకాక వయసు మీదపడటంతో, అనారోగ్య కారణాలతో తాజాగా ఆమె కన్నుమూశారు. గవాస్కర్ బంగ్లా మ్యాచ్ కు కామెంటరీ ఇస్తున్న తరుణంలోనే తన తల్లి మరణవార్త తెలిసింది. మీనల్ మరణంతో గవాస్కర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నాలుగో రోజు తొలి సెషన్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే ఈ వార్త గవాస్కర్ కు తెలిసింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలోనే అనారోగ్యంతో మీనల్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. తాజాగా మీనల్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణించినప్పటికీ ఆటపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు సునీల్ గవాస్కర్. ఇండియా-బంగ్లా మ్యాచ్ లో తల్లి మరణవార్తను దిగమింగుకుని కామెంటరీ చేశాడు. దాంతో ఈ విషయం తెలిసిన అభిమానులు సునీల్ గవాస్కర్ కు క్రికెట్ పై ఉన్న ప్రేమకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Sunil Gavaskar’s 95 yr old mother Minal passed away this morning in Bombay. Rest In Heaven Aai.
— Makarand Waingankar (@wmakarand) December 25, 2022