కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, వన్డే జట్టు కెప్టెన్ గా కోహ్లీని తప్పించడం క్రికెట్ వరల్డ్ లో పెద్ద దుమారం రేపిన సంఘటనలు అవి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని సమర్థించిన వారున్నారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా కోహ్లీని కేవలం టెస్టులకే కెప్టెన్ గా చేయడంపై ఓ షోలో రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీ తొలగించడం మంచి విషయమే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా రవిశాస్త్రి వైట్ బాల్, రెడ్ బాల్ కు వేరు వేరు కెప్టెన్లు ఉండటమే మంచిదనే భావనను వెల్లిబుచ్చాడు.
𝐓𝐡𝐞 𝐔𝐥𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐇𝐞𝐢𝐬𝐭 – @RaviShastriOfc describes #TeamIndia‘s consecutive Test series 🏆 in #Australia!
Watch #BoldAndBrave: The Shastri Way – #Byjus #CricketLIVE | Day 3, Lunch | 1st #FreedomSeries #SAvIND Test | Star Sports & Disney+Hotstar pic.twitter.com/ZJCnNeFR1C
— Star Sports (@StarSportsIndia) December 28, 2021
టీమిండియాలో ఎప్పటి నుంచి ఈ వాదన ఉండేది. వైట్ బాల్, రెడ్ బాల్ కు వేరు వేరు కెప్టెన్లు ఉంటేనే జట్టుకు మంచిదని వాదించేవారు. రవిశాస్త్రి కూడా అదే వాదనపు ఓటేశారు. అలా చేయడం అటు రోహిత్ శర్మ, ఇటు కోహ్లీకి కూడా మంచి చేసేదనే వెల్లడించాడు. ‘వేరువేరు కెప్టెన్లు ఉండటం మంచి నిర్ణయం. మొత్తం మూడు ఫార్మట్లకు కెప్టెన్ అయితే పని భారం ఉంటుంది. ఈ నిర్ణయం రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరికీ మంచిదే. ప్రస్తుతం పరిస్థితుల్లో.. బయో బబుల్ జీవనం ఇంకో ఏడాది కొనసాగితే మూడు ఫార్మట్లను ఒకే కెప్టెన్ కొనసాగించడం కష్టం’ అని రవిశాస్త్రి భావించాడు.
Former Team India head Coach Ravi Shastri said (To Indian Express),” There can’t be two white ball captains for a team that’s why Rohit should be the white ball captain and he is”.#RohitSharma | @ImRo45 | #RaviShastri pic.twitter.com/iVKAesuEIO
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) December 23, 2021
‘కోహ్లీని వైట్ కెప్టెన్సీ నుంచి తప్పించడం పర్సనల్ గా నాకు బాగా నచ్చింది. రెడ్ బాల్ క్రికెట్ ను మరింత అర్థం చేసుకునేందుకు కోహ్లీకి మంచి అవకాశం దక్కింది. టెస్టుల్లో కోహ్లీ ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం కొనసాగుతాడు. టెస్టు క్రికెట్ లో కోహ్లీలా చాలా కొద్ది మంది మాత్రమే ఉండగలరు. కాసేపు అలా కూర్చుని తన ఆట గురించి సమీక్షించుకునే మంచి అవకాశం కోహ్లీకి దక్కింది. ఎందుకంటే అతని కెరీర్ మరో ఐదారేళ్లు టెస్టు క్రికెట్ లో కొనసాగుతుంది’ అంటూ రవిశాస్తిర తన మనసులోని మాటలను పంచుకున్నాడు. వైట్ బాల్, రెడ్ బాల్ కు వేరు వేరు కెప్టెన్లు ఉండటం మంచిదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.