ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ 2022-23లో ఒక విచిత్రకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. గ్రౌండ్లో నిప్పుల వర్షం కారణంగా ఒక మ్యాచ ఆగిపోయింది. అది కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే.. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. తమిళనాడు-మహారాష్ట్ర మధ్య మూడో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా నిప్పు కణికలు, బూడిద గ్రౌండ్లో పడటం మొదలైంది. దీంతో ఆటగాళ్లు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అంపైర్లు ఆటను నిలిపివేయడంతో ఆటగాళ్లు మైదానం వీడారు. అయితే.. గ్రౌండ్లో నిప్పుల వర్షం కురవడం ఏంటని ఆశ్యర్యపోతున్నారా? అసలు విషయం ఏంటంటే.. మైదానం బయట భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి.
మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతుండటంతో గాల్లో నిప్పుకణికలు, కాలి బూడిదైన కాగితాలు లాంటివి ఎగురుతూ.. గ్రౌండ్లో వచ్చిన పడ్డాయి. దీంతో బాల్ వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుందని అంపైర్లు కొద్ది సేపు ఆటను నిలిపివేశాడు. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది.. మైదానం బయట చెలరేగిన మంటలను అదుపులోకి తీచ్చి.. ఆటను మళ్లీ కొనసాగించారు. ప్రస్తుతం ఆటగాళ్లు లంచ్ బ్రేక్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 445 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది. టీమిండియా ఆటగాడు, మహారాష్ట్ర ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 184 బంతుల్లో 24 ఫోర్లు, 8 సిక్సులతో చెలరేగి 195 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న గైక్వాడ్… ఈ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. గైక్వాడ్‌కు ఇటివల శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైనా.. తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. మళ్లీ తిరిగి రంజీల్లో పాల్గొంటున్నాడు. గైక్వాడ్‌తో పాటు కేదార్ జాదవ్ 56, అజిమ్ కాజీ 88 హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక తమిళనాడు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. ఓపెనర్ జగదీశన్ 77, ప్రదోష్ పాల్ 84, విజయ్ శంకర్(88 నాటౌట్) రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Play has been stopped in Pune as some ashes are falling on the ground. There is some stubble burning outside the stadium and the wind is bringing the ashes into the ground @sportstarweb pic.twitter.com/WqjN0wYbpH
— S Dipak Ragav (@dipakragav) January 12, 2023