పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మరిపోతుంది. బాధ్యతలు పెరిగిపోతాయి.. భార్య పిల్లలతో జీవితం బిజీబిజీగా వెళ్లిపోతుంది. మగాళ్ల జీవితంలో పెళ్లికి ముందు ఉన్న సరదాలు చాలా తగ్గిపోతాయి. సాధారణంగా ఎవరి లైఫ్ అయినా ఇలాగే సాగిపోతుంది. కానీ.. దీనికి భిన్నంగా కొంతమంది స్నేహితులు తన గ్యాంగ్‌లో ఒకడికి పెళ్లి తర్వాత కూడా క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని వధువుకు కండీషన్ పెట్టారు. ఇందుకు ఒప్పుకుంటేనే పెళ్లి జరగుతుందని భయపెట్టారు. ఏకంగా పెళ్లి మండపంలోనే వధువుతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ విచిత్రకరమైన సంఘటన మదురై జిల్లాలోని ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌లో చోటు చేసుకుంది.
ఓ ప్రైవేట్ ఇంటనీరింగ్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న హరిప్రసాద్‌కు పెళ్లి నిశ్చయమైంది. హరిప్రసాద్ ఉద్యోగం చేస్తూ.. సెలవు రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుంటాడు. కానీ.. తనకు పెళ్లి కుదరడంతో ఇక పెళ్లి తర్వాత అతను క్రికెట్‌కు రాడేమో అని ఆందోళన చెందిన స్నేహితులు ఒక ఉపాయం ఆలోచించారు. హరిప్రసాద్‌ను పెళ్లి తర్వాత కూడా క్రికెట్ ఆడేందుకు పంపించాలని, క్రికెట్ మాన్పించొద్దని కోరారు. అందుకు వధువు శని, ఆదివారాల్లో హరిప్రసాద్ క్రికెట్ ఆడేందుకు అంగీకరించింది. దీంతో వరుడి స్నేహితులు అక్కడే పెళ్లి మండపంలోనే వధువుతో అగ్రిమెంట్ కాగితాలపై సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ విచిత్రమైన సంఘటన సంబంధించిన విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భలే ఐడియా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మేము కూడా పెళ్లికి ముందు తమకు కాబోయే భార్యలతో ఇలా ఒప్పందం కుదుర్చుకుంటాం అంటూ చాలా మంది యువకులు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. కాగా.. పెళ్లి తర్వాత భార్యలు భర్తలకు చాలా విషయాల్లో కండీషన్లు పెడతారనే ప్రచారం ఉంది. ఫ్రెండ్స్‌తో తిరగొద్దు.. ఆదివారాలు ఇంట్లోనే ఉండాలి.. కుటుంబంతోనే గడపాలి అంటూ చిన్ని చిన్న సరదాలకు కూడా దూరం చేస్తారనే అపవాదు ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా తమ గ్యాంగ్‌లో ఒకడు మిస్ కావద్దని, క్రికెట్ ఆడేందుకు ఒక ప్లేయర్ తక్కువ కావద్దని హరి ప్రసాద్ స్నేహితులు ఇలాంటి వెరటీ ప్లాన్ వేశారు. మరి.. పెళ్లి తర్వాత హరిప్రసాద్ భార్య ఇచ్చిన మాట మీద నిలబడుతుంతో లేదో చూడాలి. మరి ఈ అగ్రిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: భారీ విజయం సాధించిన సచిన్ అండ్ టీమ్! దంచికొట్టిన సీనియర్ స్టార్
#NewsUpdate | நண்பனுக்காக அக்ரீமெண்ட் போட்ட நண்பர்கள் – மதுரை திருமணத்தில் நடந்த சுவாரஸ்யம்!#SunNews | #MarriageAgreement | #Madurai pic.twitter.com/BTGZJdq274
— Sun News (@sunnewstamil) September 10, 2022