టీ20 వరల్డ్ కప్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ జట్టు కూడా ఒక బుమ్రా ఉన్నాడు. సేమ్ టూ సేమ్ టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా లానే బౌలింగ్ వేస్తున్న నవీన్ ఉల్ హక్‌ను చూసి ఆశ్యర్యపోయారు. బౌలింగ్ యాక్షన్‌లో చాలా వరకు బుమ్రాను దించేశాడు ఆఫ్ఘాన్ యువ ఆటగాడు. బుమ్రా, నవీన్ బౌలింగ్ యాక్షన్‌ను కంప్యార్ చేస్తూ ఐసీసీ తన అఫిషియల్ ఇన్‌స్టా అకౌంట్‌లో ఒక వీడియోను పోస్టు చేసింది.
దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు బుమ్రా బ్రదర్ అని, బుమ్రా 2.0 అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే, నవీన్ ఉల్ హక్ మాత్రం ధారళంగా పరుగులు సమర్పించారు. నాలుగు ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం దక్కలేదు. మరి బుమ్రా లాగా బౌలింగ్ వేస్తున్న నవీన్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంతో తెలియజేయండి.