తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈటల రాజేందర్, టీపీసీసీ రేవంత్ రెడ్డి గోల్కండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని, నా వద్ద ఆధారాలున్నాయని కేటీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. దీంతో వీరిద్దరూ కలవటం ఏంటని రాజకీయంగా ఈ అంశం తీవ్ర దుమారం రేగుతోంది. అయితే కేటీఆర్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా స్పందించారు ఈటల రాజేందర్.
అవును.. నేను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిరి కలిసింది మాత్రం వాస్తవమని అన్నారు. కానీ కలిసింది ఇప్పుడు కాదని నేను రాజీనామా చేసిన అనంతరం కలిశానని తెలిపారు. నేను రాజీనామా చేసిన అనంతరం అన్ని పార్టీల నేతలతో కలిశానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీల మద్దతు లేదా అని ఈటల ప్రశ్నించారు. అయినా అభివృద్ధి కోసం పార్టీల నేతలతో కలిస్తే ఇందులో తప్పేంటంటూ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఈటల రాజేందర్ ఈ విధమన వ్యాఖ్యలు చేశారు.