తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రైతులకు శుభవార్త అందించారు. నవంబర్ 8 నుంచి పోడు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో 87 శాతం అటవీ భూములు 12 జిల్లాలోనే ఉన్నాయని, పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
దీంతో పాటు అటవీ భూములను దట్టమైన అడవులుగా మార్చాలని కోరారు. కాగా అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు మేలు చేయాలన్నారు. ఇక అడవులను నాశనం చేస్తున్న వ్యక్తులపై కఠిన శిక్షలు విధించాలని ఆదేశించారు. అలాగే గంజాయి సాగు చేస్తున్న రైతులకు సీఎం కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న పొడు భూముల రైతులకు ఎట్టి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చేది లేదంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు.