తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా టైటిల్ రీసౌండ్ వస్తోంది. సూపర్ స్టార్ మాస్ లుక్స్, డైలాగ్స్ మాత్రమే కాకుండా మహేశ్ ఊర మాసు డాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబుకు ఎంత క్రెడిట్ దక్కుతుందో.. మహానటి కీర్తీ సురేశ్ కు కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా సోషల్ మీడియాలో మ..మ..మ.. మహేశా సాంగ్ గురించే చర్చ. మహేశ్- కీర్తీ సురేశ్ వేసిన మాస్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో కెరీర్ డల్ అవుతోందని టాక్ స్టార్ట్ అయిన సమయంలో కీర్తీ సురేశ్ కు సర్కారు వారి పాట సినిమాతో మంచి అవకాశం దక్కిందనే చెప్పాలి.
కీర్తీ సురేశ్ అటు సోషల్ మీడియాలోనూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. తన లైఫ్ లో జరిగే విషయాల గురించి తరచూ ఫొటోస్ పెట్టడం, అభిమానులతో షేర్ చేసుకోవడం చేస్తుంటుంది. కీర్తీ సురేశ్ తరచూ ఫొటో షూట్స్ కూడా చేస్తుంటుంది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. అయితే ఈ మధ్య ఫొటో షూట్లలో కీర్తీ గ్లామర్ డోస్ పెంచింది అంటున్నారు. తాజాగా ఎల్లో గౌనులో బక్క పలచని రూపంలో కీర్తీ సురేశ్ ఇచ్చిన ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సర్కారు వారి పాట సినిమాలో కీర్తీ సురేశ్ యాక్టింగ్, డాన్స్ ఎలా చేసింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.