సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీలలో శ్రద్ధాదాస్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ముంబైకి చెందిన ఈ భామ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ ట్రీట్ తో కుర్రకారులో మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది. ముంబైలో పుట్టిపెరిగిన శ్రద్ధా.. ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది. ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలే చేసింది. గ్లామర్ పరంగా పేరు తెచ్చుకుంది కానీ నటిగా సక్సెస్ కాలేకపోయింది.
ఇదీ చదవండి: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న బిగ్ బాస్ హారిక.. ఫోటోస్ వైరల్!
ఇక కెరీర్ పరంగా దక్షిణ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా మెరిసింది. సినిమాలైతే చేస్తోంది కానీ మెయిన్ హీరోయిన్ గా కాదు. ప్రస్తుతం శ్రద్దా చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయట. నటిగా బిజీ కానప్పటికి, సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా మాత్రం చాలా ఫేమస్. ప్రత్యేకంగా శ్రద్దా అందాలకై ఎదురుచూసే ఫ్యాన్స్ మిలియన్స్ లో ఉంటారు. అందుకు తగ్గట్టుగానే శ్రద్దా.. ఏమాత్రం దాచుకోకుండా తన అందాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తోంది.
శ్రద్ధా కెరీర్ లో దాదాపు అన్ని రొమాన్స్ తో కూడిన పాత్రలే చేసింది. ఇదిలా ఉండగా.. శ్రద్దా తాజాగా సారీలో పిక్స్ పోస్ట్ చేసింది. చీరలో అమ్మడి అందం రెట్టింపు అయిందనే చెప్పాలి. ఇక గ్లామర్ ప్రియులకోసం నడుము, నాభి అందాలను చూపే విధానం ఓహో అనాల్సిందే. శ్రద్ధా నాజూకు నడుము అందాలకు నెటిజన్లు మనసు పారేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి శ్రద్ధా గ్లామర్ ట్రీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.