ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలంతా హోమ్ టూర్ పేరుతో వారి ఇళ్లను చూపిస్తూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలను యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మి మరో కొత్త హోమ్ టూర్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే.. ఈసారి తిరుపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేసింది లక్ష్మి.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని మంచు లక్ష్మి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ, అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంచు లక్ష్మి.. తనకు సంబంధించిన ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలు, రీల్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.
ఇక మంచు లక్ష్మి యూట్యూబ్ ఛానల్ కి కూడా సబ్ స్క్రైబర్స్ లక్షలలో ఉన్నారు. గతంలో హైదరాబాద్ ఇంటిని హోమ్ టూర్ చేసింది. ఇప్పుడు తిరుపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేసి వీడియో పోస్ట్ చేసింది. ఈ హోమ్ టూర్ లో ఇంటి బయట పచ్చని ప్రదేశం, విశాలమైన హాల్, హాల్ లో పెదరాయుడు సినిమాలో చూపించిన ఉయ్యాల, ఫ్యామిలీ ఫోటోలు, లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, పూజ గది, పక్కనే ఉన్న గెస్ట్ హౌస్.. ఇలా అన్నింటినీ చూపించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి తిరుపతి హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.