“మా” ఎన్నికలు ముగిసినా.., “మా” లో వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇక మంచు విష్ణు విజయం తరువాత రాజీనామాలా పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు విష్ణు ఎవరి రాజీనామాలు ఆమోదించను అందర్నీ కలుపుకుని పోతాను అంటూ చెప్తున్నా, పరిస్థితిల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మరోసారి మీడియా ముందుకి వచ్చింది. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది మెంబర్స్ ఆయా పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ రెండేళ్ల కాలంలో విష్ణు పనికి ఎలాంటి అడ్డు ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకాశ్ రాజ్ తెలియ చేశారు. అయితే.., ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఎన్నికలు జరిగిన తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.
“మా ఎన్నికలు జరిగిన విధానం సవ్యంగా లేదు. రౌడీయిజం జరిగింది. ఎక్కడో ఉన్న వారిని ఓటింగ్ కి తీసుకొచ్చారు. పైగా.., పోస్టల్ బ్యాలెట్ లో అక్రమాలు జరిగాయి. రాత్రి వరకు విజేతలుగా ఉన్న మా ఈసీ మెంబర్స్ ని, తెల్లారేసరికి ఓడిపోయినట్టు ప్రకటించారు. ఇక మా మెంబర్స్ పై కూడా దాడులు జరిగాయి. ఇన్ని జరిగాక కలసి పని చేయడం కుదరదు. అందుకే మా ప్యానెల్ నుండి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నాము” అని ప్రకాశ్ రాజ్ తెలియ చేశాడు. మరి.. ఎన్నికలు న్యాయంగా జరగలేదన్న ప్రకాశ్ రాజ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.