ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అగ్రదర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. మొన్నటివరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. రెండు రోజులుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. థియేటర్లలో దక్షిణాదితో పాటు నార్త్ రాష్ట్రాలలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న పుష్ప.. బన్నీకి మంచి నేమ్, ఫేమ్ తీసుకొచ్చిందని చెప్పాలి.
ప్రైమ్ లో రిలీజైన పుష్ప మూవీ రికార్డు స్థాయిలో మంచి వ్యూయర్ షిప్ రాబట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 1996 – 2004 సంవత్సరం మధ్య జరిగే కథగా సుకుమార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా విధులు చేపట్టిన విషయం విదితమే.
ఇక చంద్రబాబు హయాంలోనే పుష్ప కథ జరిగిందని చూపించడంతో సినిమాలోని ఓ పోలీస్ స్టేషన్ సన్నివేశంలో గోడపై చంద్రబాబు నాయుడు ఫోటో ఉండేలా సుకుమార్ కేర్ తీసుకున్నాడు. సినిమాలో అభిమానులు చంద్రబాబు ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. ఆ విధంగా డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీ బయటపెట్టడంతో తెగ మెచ్చుకుంటున్నారు. మరి పుష్ప ఎండింగ్ లో రస్మిక మడోనా పేరు గమనించిన వీక్షకులు.. ఇప్పుడు మాజీ సీఎం చంద్రబాబు ఫోటో గమనించి నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ChandraBabu Pic wall mida undi 🧐#Pushpa pic.twitter.com/QgTAfCnWRF
— kickkuuu🤘🔥🔥 (@SigmaMaleReddy_) January 9, 2022