సినీ ఇండస్ట్రీలో గ్లామర్ షో అనేది చాలా కామన్.. సినీతారలైనా, సీరియల్ ఆర్టిస్టులైనా గ్లామర్ విషయంలో అందరూ ఒక్కటే. అయితే.. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ గ్లామర్ అనే పదానికి ప్రాధాన్యత, ప్లాటుఫాములు మారుతూ వస్తున్నాయి. ఇదివరకు గ్లామర్ అంటే.. సినిమాల్లోనే చూసేవాళ్ళం. కానీ, కొంతకాలంగా సీరియల్స్ లో మొదలైంది. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ తో పాటు సోషల్ మీడియా వీడియోలలో కూడా టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తున్నారు హీరోయిన్లు, ఆర్టిస్టులు, టీవీ యాంకర్లు.
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, సినీనటిగా మంచి గుర్తింపు పొందిన గ్లామర్ బ్యూటీలలో యాంకర్ అనసూయ ఒకరు. సాధారణంగా టీవీ షోలలో గ్లామర్ షో అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది అనసూయ పేరే అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకొని సినిమా అవకాశాలను చేజిక్కించుకుంది. ఇక రంగస్థలం సినిమాతో అనసూయ.. నటిగా తనలోని సత్తా బయటపెట్టింది. ఆ తర్వాత నటిగా వరుస సినిమాలతో, టీవీ షోలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
సినిమాలు, టీవీ షోలు మాత్రమే కాకుండా అనసూయ సోషల్ మీడియాలో వీడియోలు కూడా చేస్తుంటుంది. ఎంతైనా గ్లామర్ బ్యూటీ కదా.. ఎక్కడైనా అందాలతో రచ్చ చేయడం అమ్మడికి కొట్టినపిండి అనిపించుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంటుంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పింక్ డ్రెస్ లో అనసూయ అందాల షో.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. మరి ప్రస్తుతం అనసూయ పోస్ట్ చేసిన కొత్త వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.