Anasuya Bharadwaj: టీవీ న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి ఎదిగారు అనసూయ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీ,బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికి తనకు లైఫ్ ఇచ్చిన బుల్లి తెరను మాత్రం మర్చిపోవట్లేదు. ఓ వైపు తనకు స్టార్ యాంకర్ హోదాతో పాటు ఫేమ్ తెచ్చిపెట్టిన ‘జబర్థస్త్’ షోను చేస్తూనే.. మరో వైపు మిగిలిన షోలను కూడా చేస్తున్నారు. అనసూయ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అభిమానుల కోసం టైంను కేటాయించటం మాత్రం మర్చిపోరు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు.
కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అభిమానుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె సూపర్ సింగర్ జూనియర్ షోలో యాంకర్‌గా చేస్తున్నారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ధరించిన డ్రెస్‌తో వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వంకపూత రంగు, తెలుపుతో ఉన్న ఆ డ్రెస్‌లో హొయలు ఒలికించారు. కేజీఎఫ్ 2 సినిమాలోని ‘మహబూబా’ పాటకు ఆమె అందంగా అటూ ఇటూ తిరగటం.. చిరునవ్వు చిందించటం బాగుంది. ఈ వీడియోలో ఆమె ధరించిన డ్రెస్‌ను ప్రముఖ సినీ డ్రెస్ డిజైనర్ గౌరీ నాయుడు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.కాగా, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నారు అనసూయ. ఇందులో నటకు గానూ ఫిల్మ్ ఫేర్, సైమా, జీ న్యూస్ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె తాజా చిత్రం ‘ఆచార్య’ అపజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప : ది రూల్’, పక్కా కమర్షియల్, రంగ మార్తండ సినిమాల్లో నటిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Madhavan: ఆర్థిక ఇబ్బందుల్లో హీరో మాధవన్.. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి సంపాదించలేదట