సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. మ్యాచ్ ఓడిన జట్టు నుంచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొంది.. ఐపీఎల్‌లో ఇలాంటి రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022లో బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ 5 వికెట్లు పడగొట్టాడు.
అద్భుతమై వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్.. గుజరాత్‌తో మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో 4 క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. హాఫ్ సెంచరీతో సూపర్ ఫామ్‌లో ఉన్న సాహా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్‌లను ఉమ్రాన్ క్లీన్ బౌల్డ్‌చేశాడు. జీటీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాఘ ఉమ్రాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి జన్‌సేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ గెలిచినా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉమ్రాన్ మాలిక్‌నే వరించింది. ఐపీఎల్‌లో హేమా హేమీలుగా పేరొందిన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. వాళ్ల కాదు.. ఐపీఎల్‌లో ఓడిన జట్టు సభ్యుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న దాఖలా ఇప్పటి వరకు లేదు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్కరమ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో శశాంక్ సింగ్ (25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో 195 పరుగులు చేసింది.
ఇక ఛేదనకు దిగిన గుజరాత్ ఓపెనర్ సాహా (68 పరుగులు 38 బంతుల్లో 11 ఫోర్లు 1 సిక్సర్), శుభ్‌మన్ (22) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాటియా (40 పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు 2 సిక్సర్లు నాటౌట్), రషీద్ ఖాన్ (31 పరుగులు 11 బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్ ) చెలరేగడంతో గుజరాత్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన SRH.. ఆగ్రహంతో ఊగిపోయిన ముత్తయ్య
All heart and sheer pace! 🔝 🔥🔥#UmranMalik pic.twitter.com/jah3VSdpx8
— Washington Sundar (@Sundarwashi5) April 27, 2022
4 timber strikes 👌 👌
1 wicket of a short ball 👏 👏
How good was that maiden 5⃣-wicket haul for Umran Malik in #TATAIPL 2022 ⚡️ ⚡️Follow the match ▶️ https://t.co/r0x3cGZLvS #GTvSRH pic.twitter.com/TpxDYn0uz8
— IndianPremierLeague (@IPL) April 27, 2022
Umran Malik’s fiery spell yesterday 💥.#IPL2022pic.twitter.com/THFZ2SlGLN
— Ketan (@ketanbangerking) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.