ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి సీజన్‌లోనే ఫైనల్స్ చేరిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన గుజరాత్.. నేరుగా ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేయగా.. గుజరాత్ 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ క్రమంలో తొలి సీజన్‌లోనే జట్టును ఫైనల్స్‌కు చేర్చిన మొనగాడిగా హార్దిక్ పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో.. గుజరాత్ జట్టు ఫైనల్ కు చేరడంపై స్పందించిన హార్దిక్ ఎమోషనల్ అయ్యాడు.
తొలి సీజన్‌లోనే జట్టు ఫైనల్స్‌కు చేరినా తాను ఎలాంటి భావోద్వేగాలకు గురి కావట్లేదని తెలిపిన హార్దిక్.. తటస్థంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తన జట్టులో ఉన్న 23 మంది ప్లేయర్లూ జట్టు విజయానికి కారకులేనని, అందుకు గర్విస్తున్నానని హార్దిక్ పాండ్యా అన్నాడు. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్.. ఇతర విదేశీ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చిందని హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలవాలనేది తన కల అని, దాన్ని సాకారం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తామని తెలిపాడు.
Gujarat Titans are into the final✅
📸: IPL/ BCCI#SanjuSamson #RajasthanRoyals #HardikPandya #GT #IPL2022 #Cricket #CricTracker #DavidMiller pic.twitter.com/MbzoPziqnx
— CricTracker (@Cricketracker) May 24, 2022
“ఇప్పుడైతే ఎలాంటి భావోద్వేగం లేదు. జీవితంలో ఎన్నో విషయాల్లో సంయమనం పాటించడం నేర్చుకున్నాను. గత రెండేళ్లుగా నన్ను నేను మరింతగా మార్చుకునేలా ప్రయత్నాలు చేశాను. ఇందులో నా కుటుంబం ముఖ్యంగా నా కుమారుడు, నా కొడుకు, నా భార్య.. మా అన్న కీలక పాత్ర పోషించారు. నేను ఇవాళ మంచి ప్రదర్శన ఇస్తున్నానంటే ఈ ముగ్గురే కారణం. తీవ్ర భావోద్వేగాలకు అతీతంగా.. పరిణతితో కూడిన జీవితం సాగించేలా ప్రోత్సహించారు. ఇక విజయమంటారా.. జట్టులోని 23 మంది ఆటగాళ్లు విజయం కోసం ప్రయత్నించిన వారే. డ్రెస్సింగ్ రూమ్ ఎంతో బాగుంది. రషీద్ ఖాన్ సీజన్ మొత్తం బాగా బౌలింగ్ చేస్తున్నాడు. డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్లను గెలిపించగల సమర్థుడు. ఇకపోతే నేను జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు రాగలను. ఈ ప్లేస్లోనే బ్యాటింగ్ కు వెళ్తాననే ప్రస్తావన ఎప్పుడూ ఉండదు. ఇదే ఇప్పటి వరకు మా సక్సెస్ వెనుక ఉన్న స్టోరీ” అని హార్దిక్ స్పష్టం చేశాడు.
Captain Hardik Pandya.
Didn’t play a single match for 5 months ahead of the IPL, rehab, NCA, working on his bowling & fitness then came to lead Gujarat and he just did that.
453 runs & 5 wickets – Leading Gujarat into the final. pic.twitter.com/3Jt0wOWb5D
— Johns. (@CricCrazyJohns) May 24, 2022
ఇది కూడా చదవండి: Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు! భయంతో కేకలు వేసిన ఆటగాళ్లు
కాగా గత ఐపీఎల్ సీజన్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నా అక్కడ కూడా విఫలమయ్యాడు. ఫిట్‌నెస్ లోపాలతో టీమిండియాకూ దూరమయ్యాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 14 మ్యాచులాడిన హార్దిక్.. 453 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రదర్శనతో హార్దిక్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక.. ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తొలి క్వాలిఫయిర్ లో ఓడిన రాజస్థాన్ జట్టు మే 27న రెండో క్వాలిఫయర్ పోరులో తలపడుతుంది. అనంతరం అక్కడ గెలిచిన జట్టు ఫైనల్ లో గుజరాత్ ను ఢీకొడుతుంది.
Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏
Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA
— IndianPremierLeague (@IPL) May 24, 2022