రోడ్డు ప్రమాదాలు అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి. కానీ, కొన్ని ప్రమాదాలు మాత్రం మనల్ని విస్మయానికి, ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు నోరెళ్లబెడతారు. అలాంటి ఒక ప్రమాదం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఓ వ్యక్తి కారు బానెట్‌పై పడగా.. యువతి కారును ఆపకుండా అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ అనే వ్యక్తికి ప్రియాంక అనే యువతికి జ్ఞానభారతి నగర్ లో వివాదం జరిగింది. ఆ యువతి అతని స్విట్ కారును ఢీకొట్టినట్లు ఆరోపించాడు. ఆ సమయంలో వారివురుకి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆమె దర్శన్ కు మిడిలి ఫింగర్ కూడా చూపించినట్లు అతను ఫిర్యాదులో రాసుకొచ్చాడు. అయితే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. యువకుడు ఆమె టాటా నెక్సన్ కారు బానెట్ పై పడ్డాడు. ఆమె కారును అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. దాదాపు కిలోమీటరు దూరం వరకు దర్శన్ అలా ఆమె కారు బానెట్ పైనే ఉన్నాడు.
#WATCH: #Bengaluru Road Rage Video! Woman drags man on car bonnet for 1 km, second incident in a week#RoadRage #Altercation #Shocking #NewsUpdate #NewsToday pic.twitter.com/UdDxHWycj1
— Free Press Journal (@fpjindia) January 20, 2023
అతను అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీలులేక అలా ఉండిపోయాడు. ఆ యువతి మాత్రం కారు ఆపలేదు. వెనుక చాలా మంది బండ్ల మీద ఫాలో అయ్యారు. కారు ఆపాలంటూ కేకలు వేశారు. ఎదురుగా వచ్చే వాహనదాహరులకు తమ బండిని అడ్డుగా పెట్టాలంటూ అరిచారు. అలా ఆమె కిలోమీటరు దూరం తీసుకెళ్లిన తర్వాత కారును ఆపింది. ఈ ఘటనలో దర్శన్- ప్రియాంక సహా మొత్తం ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంకపై ఓ వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిందంటూ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనే ఇటీవల బెంగళూరులో జరిగింది. ఓ వృద్ధుడిని యువకుడు స్కూటీతో ఢీకొట్టి.. ఈడ్చుకుని వెళ్లాడు.
Trigger Warning: Disturbing Visuals
Biker in Bengaluru had hit a car and tried to run away. Meanwhile, car driver managed to catch his bike. But biker ruthlessly drove with car driver clinging to the bike.
People who witnessed it helped the poor driver. pic.twitter.com/hplSfI37wY
— Aathiraa Anand (@AnandAathiraa) January 17, 2023