ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పట్టపగలు బరితెగించి ప్రవర్తించాడు. నడి రోడ్డుపై యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మధ్య కాలంలో కొందరు యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమించాలని వెంటపడడం, ఒప్పుకోకపోతే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించాడో యువకుడు. పట్టపగలు నడి రోడ్డుపై యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇంతకు ఆ యువకుడు చేసిన పనేంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
అది ఉత్తర్ ప్రదేశ్ పూణే పరిధిలోని సదాశివపేట్. ఇదే ప్రాంతంలో ఓ యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరూ గతంలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ స్నేహితులుగా మారిపోయారు. దీనినే ఆసరాగా మలుచుకున్నఆ యువకుడు.. ఆ యువతిని ప్రేమించాలని వెంటపడినట్లు తెలుస్తుంది. కానీ, ఆ యువతి మాత్రం అతగాడి ప్రేమకు నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ యువకుడు ఆ అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆ యువతిని హత్య చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా ఇటీవల ఆ యువతి కాలేజీకి వెళ్లడం గమనించాడు.
ఇక పక్కా ప్లాన్ తోనే ఆ యువకుడు కత్తి చేత బట్టి ఓ చోట ఆ యువతి రాక కోసం ఎదురు చూశాడు. ఆ అమ్మాయి రాగానే ఆ యవకుడితో కత్తితో ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇదంతా గమనించిన స్థానికులు.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు అడ్డుకోబోయిన వారిపై సైతం కత్తితో ఎదురు తిరిగాడు. మొత్తానికి అందరూ కలిసి ఆ దుర్మార్గుడి నుంచి ఆ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
THIS IS HUGE: Thanks for your efforts, Pune residents – Set the example for Delhi Sakshi Case.
A Pune man attempted to kiII a female after an attack because of one-sided love, but locals intervened, caught the attacker, and saved the girl, Salute!🔥👏 pic.twitter.com/WO0W04cVr1
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 27, 2023