ఓ జంటకు ఈ మధ్యే పెళ్లైంది. శోభనం కోసం బంధువులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ నవ వధువు మాత్రం పీరియడ్స్ అంటూ అలా కొన్ని రోజులు ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చింది. ఇక బంధువులు కూడా నిజమేనని అనుకున్నారు. తీరా వారం గడిచే సరికి ఆ యువతి అందరికీ షాకిచ్చింది. అసలు కొత్త పెళ్లి కూతురు చేసిన పనేంటి? భర్త తలపట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే కదా మీ ప్రశ్న? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతం. రాహుల్ అనే యువకుడు లలిత అనే యువతిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. అయితే బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అలా వారం రోజులు గడిచింది. ఇక వారి సాంప్రదాయం ప్రకారం వీరి శోభనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ కొత్త పెళ్లి కూతురు మాత్రం పీరియడ్స్ సాకుతూ కొన్ని రోజులు ఫస్ట్ నైట్ ను వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. దీనిని బంధువుల కూడా నిజమే అని అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Rajanna Sircilla: అప్పులు తీర్చాలంటూ భర్త వేధింపులు.. పిల్లలతో కలిసి బావిలో దూకి భార్య ఆత్మహత్య!కట్ చేస్తే..ఏడు రోజుల తర్వాత బంగారు ఆభరణాలతో పాటు మూడు లక్షల రూపాయల నగదుతో కొత్త పెళ్లి కూతురు పారిపోయింది. తాను మోసపోయామని గ్రహించిన భర్త రాహుల్ పోలీసులను ఆశ్రయించాడు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో మాత్రం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ దొంగ పెళ్లిళ్ల ముఠాలో ఈమె కూడా సభ్యురాలు అని తెలిసింది. డబ్బు కోసమే పెళ్లిళ్లు చేసుకుని ఇలాంటి ఇలాంటి మోసాలు చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.