నడి రోడ్డుపై లవర్స్ రెచ్చిపోయారు. బైక్ పై స్టంట్స్ చేస్తూ తన ప్రియురాలికి వైరైటీగా ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నడి రోడ్డుపై లవర్స్ రెచ్చిపోయి ప్రవర్తించారు. తన ప్రేయసిని బైక్ ముందు కూర్చోబెట్టుకుని వినూత్న రీతిలో స్టంట్స్ చేస్తూ.. చివరికి తన ప్రియురాలికి వైరైటీగా ప్రపోజ్ చేశాడు. ఇదంతా కొందరు వీడియోలు తీశారు. ఇక అదే వీడియోను చివరికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మధ్యప్రదేశ్ ఛింద్వారాలోని ఓ ప్రాంతానికి చెందని ఓ యువతి, యువకుడు ప్రేమికులు. గత కొంత కాలం నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లవర్స్ ఇటీవల నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తించారు. ఓ బైక్ పై వెళ్తూ నడి రోడ్డుపై స్టంట్స్ చేశారు. ఇదే కాకుండా తన ప్రియురాలని తన బైక్ ముందు కూర్చోబెట్టుకుని వినూత్న రీతిలో ఇద్దరూ బైక్ పై స్టంట్స్ చేశారు. ఇక ఇంతటితో ఆగని ఆ యువకుడు స్టంట్స్ చేస్తూనే.. ఎండింగ్ లో తన ప్రియురాలికి వెరైటీగా ప్రపోజ్ చేశాడు.
దినంతటినీ కొందరు వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారాయి. అదే వీడియోలు చివరికి పోలీసుల చెంతకు చేరడంతో వారిపై కఠిన చర్యలకు సిద్దమయ్యారు. రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించడమే కాకుండా, వినూత్న రీతిలో బైక్ పై స్టంట్స్ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు సీరియస్ అయ్యారు.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుపై ఇలా ఎవరైనా నిబంధల అతిక్రమించడం, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. రోడ్డుపై నిబంధనలు ఉల్లిఘించి బైక్ పై స్టంట్స్ చేసిన ఈ లవర్స్ తీరుపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) February 18, 2023