పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అంబురాజ్. వయసు 33 ఏళ్లు. ఈ యువకుడు చెన్నైలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. దీంతో ఈ దొంగను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఎంతకు కూడా అతడిని పట్టుకోలేకపోయారు. కానీ వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తుంటే.. స్థానికులు మాత్రం ఇతడిని దేవుడిలా కొలుస్తూ మెచ్చుకుంటున్నారు. ఇక ఇతగాడి గురించి తెలుసుకున్న నెటిజన్స్ కూడా ఇతనికి సెల్యూట్ చేస్తున్నారు. దొంగను మెచ్చుకోవడం ఏంటనే కదా మీ ప్రశ్న? అసలు దొంగను స్థానికులు దేవుడిలా కొలవడానికి కారణం ఏంటి? అంతలా అతడు చేస్తున్న పనులేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇతని పేరు అంబురాజ్. 33 ఏళ్ల వయసున్న ఈ యువకుడు చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను పగలు పూట భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే అంబురాజ్ పగలు కష్టపడి పని చేస్తూ రాత్రి పూట తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గత ఐదేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ బంగారం, డబ్బులు దోచుకుంటున్నాడు. దీంతో ఇతడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తుంటే అతడు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఇక ఎట్టకేలకు ఇటీవల జరిగిన ఓ దొంగతనం కేసులో పోలీసులు అంబురాజ్ ను అరెస్ట్ చేశారు. అయితే అతడిని అరెస్ట్ చేసి విచారించగా.. అందరి కళ్లల్లో కన్నీళ్లు తెప్పించాడు. విషయం ఏంటంటే? అంబురాజ్ రాత్రిపూట చేసిన దొంగతనాల్లో డబ్బంతా కూడబెట్టి నిరుపేదల ఆకలి తీర్చుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో భాగంగా కొంత మంది స్థానికులను విచారించగా.. అంబురాజ్ చాలా మంది వ్యక్తి అని, తరుచు నిరు పేదలకు ఆహార పదార్థాలను పంచి పెట్టడం మేము చూశామంటూ తెలిపారు. ఇది విన్న పోలీసుల గుండెలు సైతం కరిగిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల గుండెలను పిండేస్తుంది.