భార్య పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న విషయం భర్తకు తెలిస్తే ఏం చేస్తాడు? హెచ్చరించడమో లేదంటే హత్య చేయడమో చేస్తారు. కానీ ఓ భర్త ఇలా కాకుండా ఏకంగా భార్యను వివాహేతర సంబంధాల్లో తలదూర్చమంటూ వేధింపులకు గురి చేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సభ్య సమాజం తలిదించుకునేలా ఉంది. అసలు ఈ దారుణ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే పూర్తి వివరాలు మీ కోసం.
ఇండియాకు చెందిన విక్రమ్ (పేరు మార్చాము) విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసేవాడు. `కొన్నాళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేస్తూనే పాశ్చత్య సంస్కృతిని అలవాటు చేసుకున్నాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇండియాకు చెందిన హాసిని (పేరు మార్చాము) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత భర్యను కూడా తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లాడు. ఇక పెళ్లై 3 ఏళ్లు గడిచింది. పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది.
ఇది కూడా చదవండి: Bihar: భార్య వివాహేతర సంబంధం.. కరెంట్ పోల్ కి కట్టేసి చితకబాదిన భర్త!
కానీ కొన్ని రోజుల నుంచి భర్త విక్రమ్ భార్యను ఊహించని వేధింపులకు గురి చేశాడు. వరకట్న వేధింపులో లేక మరెదైన వేధింపులో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవును.. భార్యను ఏకంగా నా స్నేహితుడితో పడుకోవాలంటూ భర్త సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. నా స్నేహితుడి భార్యతో నేను.. నా స్నేహితుడితో నువ్వు రాత్రిపూట గడుపుదామంటూ భర్త భార్యకు చెప్పాడు. భర్త మాట విన్న హాసిని ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇలా కొన్ని రోజుల పాటు హాసిని భర్త వేధింపులను తట్టుకుంటూనే ఉంది. ఇక కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలిద్దరూ ఇండియాకు తిరిగొచ్చారు.
ఇక ఎవరికీ చెప్పుకోని విధంగా ప్రవర్తించిన భర్త తీరుపై హాసిని తన తల్లిదండ్రులకు చెప్పింది. కూతురు చెప్పిన విషయాలు విని తల్లిదండ్రులు షాక్ నుంచి తేలుకోలేకపోయారు. దీంతో వెంటనే హాసిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక భార్యాభర్తలను ఇద్దరిని పలిపించి కౌన్స్ లింగ్ తో పాటు వారితో కూడా చర్చించారు. దీంతో ఇప్పుడు రెండు కుటుంబాలు సమస్య పరిష్కారానికి పావులు కదుపుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భార్యపై భర్త ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.