ఎడడుగులేసి వివాహబంధాన్ని ఒక్కటి చేసుకుంటారు భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు వారి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. భర్తపై భార్య, భార్యపై భర్త ఇలా..ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకుంటూ వారి బంధాన్ని పచ్చగా వెలుగేలా చూసుకుంటారు. ఇలా సాగుతున్న వీరి బంధాన్ని పెంచుకోవాల్సింది పోయి కొందరు అక్రమ సంబంధాలతో తెంచుకుంటున్నారు. కొందరు భర్యాభర్తలు తెర వెనుక వివాహేతర సంబంధాలకు ఊపరి పోస్తూ పచ్చటి జీవితాలపై అగ్గి రాజేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి సంచలనంగా మారింది.
అది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరి గ్రామం. సుజాత అనే మహిళకు కొన్నేళ్ల క్రితం రమేష్తో వివాహం జరిగింది. కొన్ని రోజుల పాటు వీరి వివాహ బంధం పాఫీగానే కొనసాగుతోంది. కానీ భార్య మాత్రం తెర వెనుక వివాహేతర బంధానికి తెర లేపింది. అదే గ్రామానికి చెందిన పెద్దయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక తన మేనమామ అయిన శంకరయ్య కూడా పెద్దయ్య భార్యతో తెర వెనుక ఎఫైర్ పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయం చివరికి పెద్దయ్యకు తెలిసిపోయింది. ఇక భయపడ్డ శంకరయ్య పెద్దయ్య హత్యకు కన్నం వేశాడు.
ఎలా అని ఆలోచించే సమయంలో సుజాత గుర్తుకు వచ్చింది. దీంతో సుజాత సాయం తీసుకుని పెద్దయ్య హత్యకు కుట్రచేశాడు శంకరయ్య. అనుకున్నట్లుగానే ఓ రోజు రాత్రి ఓ చోటకు రమన్నారు పెద్దయ్య, సుజాత. దీంతో సుజాతను నమ్మిన పెద్దయ్య చివరికి వారు పిలిచిన చోటుకు వచ్చాడు. ఇక వచ్చిన పెద్దయ్యను తన అల్లుడు శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి పత్తికొండ గురుకుల పాఠశాల వద్ద అర్ధరాత్రి 11 గంటలకు హతమార్చారు. దీంతో అనుమానం రాకుండా ఆ శావాన్ని తెలంగాణ రాష్ట్రం పరిధిలోని బీచుపల్లి సమీపంలో కృష్ణానదిలో పడేశారు.
పెద్దయ్య కనిపించకపోవటంతో తల్లి పోలీసులకు సమాచారం అందించింది. ఎంతకు కేసుకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాకపోవటంతో పోలీసులు వివాహేతర సంబంధాల కోణంలో విచారించారు. చివరికి పోలీసులు ఊహించిన రీతిలో కేసులో పురోగతి లభించింది. దీంతో విచారణ చేపట్టి నిందితులైన శంకరయ్య, సుజాత, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.