దేశంలో రోజుకొక చోట బాలికలపై అత్యాచార దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న కొందరు కేటుగాళ్లు అభం,శుభం తెలియని చిన్నారులపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అఘాయిత్యాలపై గతంలో ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ 9 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన షేక్ సలీమ్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సలీమ్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే కొంత కాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ భర్త గత కొంత కాలం నుంచి భార్యతో గొడవ పడుతుండేవాడు. దీంతో విసుగు చెందిన భార్యతో భర్తతో ఉండలేక పుట్టింటికి వెళ్లింది.
ఇది కూాడా చదవండి: Amnesia Pub Case: బాలిక ఒంటిపై 12 చోట్ల గాయాలు.. మరీ ఇంత దారుణామా?
దాదాపుగా మూడు నెలల నుంచి సలీమ్ ఇంటి వద్ద ఒంటరిగానే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే షేక్ సలీమ్ ఇంటి ఎదురుగా ఉండే ఓ 9 ఏళ్ల బాలికపై కన్నేశాడు. దీంతో సమయం దొరికితే ఏదో చేయాలన్న విషపు ఆలోచనలతో నిండిపోయి ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆ బాలికకు బాబాయ్ అంటే విపరీతమైన భయం. ఇదే అదునుగా భావించిన సలీమ్ మీ బాబాయ్ కు చెప్పి కొట్టిస్తానంటూ లొంగదీసుకుని ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఇక దీనిని గమనించిన ఓ మహిళ సదరు బాలికను ప్రశ్నించింది. అసలు విషయం బయటకు రావడంతో స్థానికులు అందరూ కలిసి అతనిని నీలదిసి చితకొట్టారు. అనంతరం బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.